పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. తుది మెట్టుపై బోల్తా కొడుతూ త్రుటిలో పతకం కోల్పోతుండడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. ఇప్పటికే ఏడు విభాగాల్లో భారత్‌కు పతకం అందినట్లే అంది దూరమైంది. ఇప్పుడు ఖాయమైన పతకం కూడా చేజారడం పెద్ద షాక్. మంగళవారం రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరడం ద్వారా పతకం ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి జరగాల్సిన ఫైనల్లో గెలిస్తే ఆమెకు స్వర్ణం దక్కేది. ఓడినా రజతం సొంతమయ్యేది. కానీ ఫైనల్ బౌట్ జరగడానికి ముందే వినేశ్ మీద అనర్హత వేటు పడి పతకం దూరం కావడం పెద్ద షాక్. తన విభాగంలో ఉండాల్సిన 50 కిలోల బరువు కంటే 50 గ్రాములు ఎక్కువ ఉండడంతో ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ ఒలింపిక్స్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వినేశ్ నిరాశగా ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించక తప్పట్లేదు.
రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడల్లో బరువును బట్టి విభాగాలు ఉంటాయి. తాము పోటీ పడుతున్న విభాగానికి సంబంధించి నిర్దేశించిన బరువు కంటే ఒక్క గ్రామ్ కూడా ఎక్కువ ఉండకూడదు. క్రీడాకారులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ వినేశ్ లాంటి ఎంతో అనుభవమున్న, అగ్రశ్రేణి రెజ్లర్ బరువు సరి చూసుకోకుండా ఎలా పోటీలో దిగిందన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. సెమీస్‌లో గెలిచిన కొన్ని గంటల తర్వాత ఆమె బరువు కొలవగా 50 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు తేలింది. దీంతో నిబంధనల ప్రకారం ఆమె మీద అనర్హత వేటు వేశారు. ఇలా చేతుల్లోకి వచ్చిన పతకం దూరం కావడం వినేశ్‌కే కాదు.. అభిమానులకు కూడా పెద్ద షాక్. వినేశ్, కోచింగ్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారన్నది అర్థం కాని విషయం. వినేశ్ నిజానికి ఏడాది ముందు వరకు 57 కేజీల విభాగంలో పోటీ పడేది. కానీ ఈ ఒలింపిక్స్ కోసం 50 కేజీలకు మారింది. ఈ క్రమంలో బరువు తగ్గే ఒలింపిక్స్‌కు వెళ్లింది. కానీ పోటీల సమయంలో అనుకోకుండా కాస్త బరువు పెరిగితే అదే ఇప్పుడు శాపంగా మారింది.
This post was last modified on August 7, 2024 7:19 pm
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…
నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా…