అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న నాయకుల కంటే కూడా వారికి మద్దతిస్తున్న వారి మధ్య పెద్ద ఎత్తున పొలిటికల్ ఫైట్ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు లేని రగడ.. ఇప్పుడు అధికార పార్టీ డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి మార్పుతో తీవ్రస్థాయిలో తెరమీదికి వచ్చింది. డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ పార్టీకి గెలుపు అంచనాలు పెరుగుతున్నాయి. పైగా కమలా హ్యారిస్‌కు మద్దతు దారులు కూడా పెరుగుతున్నారు. దీనిని ట్రంప్‌కు మద్దతిస్తున్నవారు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇటు విరాళాలు, అటు మద్దతుగా ప్రచారంలోనూ హ్యారిస్ దూకుడుగా ఉన్నారు. ఇదేసమయంలో నిన్న మొన్నటి వరకు దూకుడుగా ఉన్న ట్రంప్ స్వల్పంగా వెనుక బడ్డారు. ఆయనకు మద్దతు ఉన్నా.. హ్యారిస్ రంగంలోకి దిగిన తర్వాత.. మాత్రం కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. దీంతో మద్దతు దారుల మధ్య వివాదాలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తున్నాయి. నిన్న హ్యారిస్‌కు భారీ విరాళాలు ప్రకటించిందన్న కారణంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ను నిషేధించాలంటూ.. ట్రంప్ మద్దతు దారులు పెద్ద ఎత్తున వివాదాన్ని తెరమీదికితెచ్చారు. ఇది ఇంకా సర్దు మణగలేదు.
ఇంతలోనే మరో వివాదం తెరమీదికి వచ్చింది. ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ వర్సెస్ ప్రపంచ నెట్ దిగ్గజం గూగుల్ సంస్థకు మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ రచ్చ తెరమీదికి వచ్చింది. మస్క్ డొనాల్డ్ ట్రంప్‌ను సమర్థిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు నెలకు 47 మిలియన్ డారల్ల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇక, ప్రచారానికి కూడా దన్నుగా నిలుస్తున్నారు. ట్రంప్‌ను వ్యతిరేకించేవారి ఎక్స్ ఖాతాలను నిలిపివేస్తున్నారు. అయితే.. గూగుల్ మాత్రం తటస్థంగా ఉందని చెబుతోంది. తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని.. ప్రజల అభిప్రాయాలకు మాత్రమే విలువ ఇస్తామని చెబుతోంది.
కానీ, గత 24 గంటలుగా గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో “డొనాల్డ్‌ట్రంప”కు సంబంధించిన సమాచారం కనిపించడం లేదు. గూగుల్ సెర్చ్‌లో ‘డొనాల్డ్ ‘ అని టైప్ చేస్తే.. ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ డక్’, ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ రీగన్’ అని వస్తోంది. దీనిని కార్నర్ చేస్తూ.. మస్క్ గూగుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “ట్రంప్‌పై సెర్చ్ చేయడాన్ని నిషేధించారా” అని గూగుట్‌ను నిలదీశారు. ఇది ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం కాదా? తటస్థంగా ఉండడం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. తటస్థంగా ఉన్నామంటూనే మరొకరికి(కమల) మద్దతు ఇస్తే.. గూగుల్ తనను తాను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నట్లేనన్నారు.
మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యంలో ట్రంప్‌ను సమర్థిస్తున్నవారు.. మెచ్చుకుంటున్నారు. అంతేకాదు.. మస్క్‌తోనే మేమంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు.అయితే.. హ్యారిస్ మద్దతు దారులు మాత్రం మస్క్‌ను తిట్టిపోస్తున్నారు. గతంలో మీరు చేసింది మాత్రం గొప్పగా ఉందా? అంటూ.. గతంలో ఎక్స్‌ను కొందరికి నిషేధించిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఎలా చూసుకున్నా.. ట్రంప్ వర్సెస్ కమల మద్దతు దారుల మధ్య రాజకీయ రగడ తారస్తాయికి చేరింది. ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on July 30, 2024 10:53 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…