Trends

బెట్టు వీడి.. మెట్టు దిగి.. బైడెన్ ఇక‌, చ‌రిత్రే!

ప‌ద‌వీ లాల‌స… పుడ‌క‌ల‌తో కానీ.. పోదంటాడు తెనాలి రామ‌కృష్ణ క‌వి! అచ్చం ఇలానే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. తాను కుర్చీని వ‌దిలేది లేద‌ని.. అధ్య‌క్ష ఎన్నిక‌ల రేసు నుంచి ఇసుమంతైనా త‌ప్పుకొనేది లేద‌ని.. త‌న ఆరోగ్యంపైనా.. త‌న‌పైనా.. కుట్ర లు చేస్తున్నార‌ని తెగ ఆవేద‌న .. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌.. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్.. ఎట్టకేల‌కు మెట్టుదిగారు.

అంతేకాదు.. తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్ర‌స్తుత అధ్య‌క్ష స‌మ‌రంలో పోటీ నుంచి త‌ప్పుకొనేది లేద‌న్న ఆయ‌న‌.. పొంచి ఉన్న ప‌రాభ‌వ ఘ‌ట్టాన్ని(ఆయ‌న కాద‌ని భీష్మిస్తే.. అధ్యక్ష రేసు నుంచి దింపేసేందుకు డెమొక్రాట్లు రెడీ అవుతున్నారు) మ‌దినెంచి.. మొత్తానికి మెట్టు దిగారు. అమరికా అధ్యక్ష రేసులో పోటీ నుంచి విర‌మించుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

దీంతో న‌వంబ‌రులో జ‌ర‌గ‌నున్న అగ్ర‌రాజ్యం అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అధికార పార్టీ డెమొక్రాట్ల త‌ర‌ఫున వేరే అభ్య‌ర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ పెద్ద‌దే అయినా.. కొంత మేర‌కు కుదించుకుని.. కొత్త అధ్య‌క్ష అభ్య‌ర్థిని ఎంపిక చేసుకునే క్ర‌తువులో డెమొక్రాట్లు బిజీగా ఉన్నారు. ప్ర‌ధానంగా బైడెన్ త‌ప్పుకోవ‌డంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. “ఆయ‌న త‌నంత‌ట తానుగా త‌ప్పుకోవ‌డం మంచిదైంది. గాడ్ బ్లెస్ హిమ్‌” అనే కామెంట్లు దాదాపు డెమొక్రాట్ల నుంచే కాకుండా.. బైడెన్ ను అత్యంత అభిమానించే వారి నుంచి కూడా ఎక్స్ వేదిక‌గా రావ‌డం గ‌మ‌నార్హం. అంటే.. అంద‌రికీ అర్ధ‌మైంది.. బైడెన్ ఉంటే ట్రంప్ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని!!

ఏడాది వృథా!

అమెరికాలో 2020లో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కిన త‌ర్వాత‌.. బైడెన్‌కు అనేక చిక్కులు వ‌చ్చాయి. వాటిలో తొలి దెబ్బ క‌రోనా. ఆయ‌న అధ్య‌క్ష పీఠం ఎక్క‌డానికి ముందే.. కొంత సంకేతాలు వ‌చ్చినా.. అప్ప‌టి ప్రెసిడెంట్ ట్రంప్ దీనిని కొట్టి పారేశారు. చైనా కుట్ర అని.. క‌రోనా అస‌లు దేశంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌న్నారు. కానీ, ట్రంప్ దిగిపోయే స‌రికి అమెరికాలో వ్యాపించేసింది. దీనికి కార‌ణం.. ఆయ‌న స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డ‌మే. ఇక‌, ప‌గ్గాలు చేప‌డుతూనే.. బైడెన్ క‌రోనాపై స‌మ‌రం ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ఫ‌లితంగా ఏడాది స‌మ‌యం వృథా అయిపోయింది. ఇక‌, వ‌ల‌స విధానంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.

అదేస‌మ‌యంలో కెన‌డాతో గోడ వ్య‌వ‌హారంలో ఏం చేయాల‌న్న దానిపైనా బైడెన్ చురుగ్గా నిర్ణ‌యం తీసుకోలేక పోయారు. మ‌రో వైపు ప్ర‌తిప‌క్షంలో ఉన్న ట్రంప్ నిత్యం టార్గెట్ చేయ‌డంతోపాటు.. ఏకంగా.. వైట్ హౌస్‌పై దాడులు చేయించార‌నే వివాదం కూడా ఉంది. ఇక‌, ట్రంప్పై ప‌లు కేసుల న‌మోదు వ్య‌వ‌హారం కూడా.. బైడెన్‌కు చుట్టుకుంది. ఒకానొక ద‌శ‌లో ట్రంప్‌.. ఈ కేసుల‌ను రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని చెప్పిన‌ప్పుడు.. కొంద‌రు డెమొక్రాట్లు.. మౌనంగా ఉండిపోయి.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికిన విధానం కూడా.. బైడెన్ను చిక్కుల్లో ప‌డిపోయారు. మ‌రో కీల‌క విష‌యం.. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈ విష‌యంలో బైడెన్ చెప్పిన దానికి.. క్షేత్ర‌స్థాయిలో జ‌రిగిన దానికి సంబంధం లేక‌పోవ‌డం..ఉక్రెయిన్‌కు స‌హ‌క‌రించ‌డం.. శాంతి విల‌సిల్లే దిశ‌గా ఆయ‌న చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం.. నాటోలో ఉక్రెయిన్‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని బ‌హిరంగంగా చేసిన ప్ర‌క‌ట‌న‌లు వంటివి.. అమెరికాపై తీవ్ర ప్ర‌భావం చూపించాయి.

ఇక‌, ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం వంటివి బైడెన్ హ‌యాంలో భారీగా పెరిగిపోయాయి. వీటికితోడు.. తుపాకీ సంస్కృతి పెచ్చ‌రిల్లిపోయింది. ఇదే ఇప్పుడు బైడెన్ అధ్య‌క్ష రేసు నుంచి త‌ప్పుకొనేలా చేసింది. ఇటీవ‌ల ట్రంప్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం త‌ర్వాత‌.. ఆయ‌న‌కు సింప‌తీ పెరుగుతుంద‌న్న అంత‌ర్జాతీయ విశ్లేష‌కుల అంచ‌నాలే నిజ‌మ‌య్యాయి. ఫ‌లితంగా బైడెన్ ఉంటే.. ఆయ‌న‌ను ఎదిరించ‌లేర‌న్న నిర్ణ‌య‌మూ తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో మెట్టు దిగి, బెట్టు వీడి బైడెన్ పోటీ నుంచి త‌ప్పుకొన్నారు. ఇక‌, బైడెన్ అమెరికా చ‌రిత్ర‌లో స‌మ‌ర్థ‌-అస‌మ‌ర్థ అధ్య‌క్షుడిగా నిలిచిపోతారు!!

This post was last modified on July 22, 2024 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

11 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

36 minutes ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

2 hours ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

3 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

3 hours ago