వాళ్లు వరసకు బంధువులు అవుతారు. అమెరికాలో పైచదువులు చెప్పిస్తామని ఆశపెట్టారు. బంగారు భవిష్యత్తును కళ్ల ముందు చూయించారు. తీరా అమెరికాకు తీసుకొచ్చాక బంధువుతో వెట్టిచాకిరీ చేయించుకున్నారు. ఎలాగోలా వీరి బారి నుండి బయటపడ్డ అతను అమెరికా కోర్టును ఆశ్రయించాడు. ఈ భారతీయ అమెరికన్ జంటకు అమెరికా కోర్టు భారీ షాక్ ఇచ్చింది.
నిందితులైన భార్యాభర్తలకు జైలు శిక్ష విధించడమే కాకుండా బాధితుడికి రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. నిందితుడు హర్మన్ ప్రీత్ సింగ్ కు 11.25 ఏళ్ల జైలు శిక్ష, అతడి భార్య కుల్బీర్ కౌర్‌కు 7.25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని నిందితులు తమ బంధువైన అబ్బాయిని పైచదువులు చదివిస్తాం, మంచి భవిష్యత్ చూపిస్తాం అని ఆశపెట్టి అమెరికాకు రప్పించుకున్నారు. ఆ తరువాత అతడి వద్ద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వేధింపులకు పాల్పడుతూ వెట్టి చాకిరీ చేయించుకున్నారు. వర్జీనియాలో ఉన్న వారి గ్యాస్ స్టేషన్, షాపులో రోజుకు 12 నుండి 17 గంటల చొప్పున పని చేయించుకున్నారు. చివరకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా వేధించారు.
షాపు వెనకభాగంలోని స్టోర్ రూంలోనే ఉండేలా చేశారు. భారత్ కు వెళ్లేందుకు అనుమతించలేదు. వీసా గడువు ముగిసినా అమెరికాలో కొనసాగేలా చేశారు. తన డాక్యుమెంట్లు ఇవ్వమని కోరితే దాడికి దిగడమే కాకుండా సెలవు అడిగితే తుపాకీ చూపిస్తూ చంపేస్తామని కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి క్రూరత్వాన్ని గమనించిన కోర్టు ఇద్దరికీ శిక్షలు విధించడం గమనార్హం.
This post was last modified on June 28, 2024 10:10 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…