దాసరి సాయి కుమారి అంటే మీకు తెలుసా ? ఖచ్చితంగా తెలిసి ఉండదు. కుమారి ఆంటీ తెలుసా అంటే మాత్రం ఖచ్చితంగా తెలియదు అని మాత్రం చెప్పరు. రోడ్డు పక్కన తక్కువ ధరకు రుచికరంగా ఆహారం అందిస్తూ సోషల్ మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది కుమారి ఆంటీ.
వీడియోలు చూసి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని, రోడ్డు మీద న్యూసెన్స్ అవుతుందని హైదరాబాద్ పోలీసులు ఆమె హోటల్ సీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన సపోర్ట్ చూసి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె యధావిధిగా బిజినెస్ చేసుకునేందుకు అనుమతించింది.
తనకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేసిన కుమారీ ఆంటీ ఇటీవల ఏపీ శాసనసభ ఎన్నికల్లో సొంతూరు గుడివాడ వెళ్లి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ప్రచారం కూడా చేయడం గమనార్హం.
యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం వెంటపడ్డాయి. పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారీ ఆంటీ. అయితే ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. దీనిలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం అన్వేషిస్తున్న బిగ్ బాస్ టీమ్ కుమారీ ఆంటీని సంప్రదించినట్లు సమాచారం.
ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్దమయినట్లు తెలుస్తుంది. మరి కుమారీ ఆంటీ ఎస్ అంటుందా ? నో అంటుందా ? చూడాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
This post was last modified on June 15, 2024 9:14 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…