Trends

ఇద్దరు ప్రియులతో సహజీవనం, తండ్రికి తెలియడంతో హత్య

తల్లిని కోల్పోయిన బిడ్డ పెడదారి పడుతుందని తెలుసుకున్న ఆమెకు పెళ్లి చేస్తే దారిలో పడుతుందని ఆశించాడు. ఆమెకు పెళ్లి కుదిర్చి రూ.80 లక్షల విలువైన రెండంతస్తుల భవనం కూడా ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. ఇద్దరు ప్రియుళ్ల మత్తులో ఉన్న ఆమె పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఏకంగా రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి మరీ తండ్రిని హతమార్చింది.,

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్య సమాజం తలవంచుకునేలా ఉంది. మదనపల్లి పట్టణంలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలీకమ్ కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి నివసిస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట చని పోయారు. అప్పటి నుంచి తన ఒక్కగానొక్క కూతురు హరిత (25) ను కంటికి రెప్పలా దొరస్వామి కాపాడుతున్నారు. ఆమె బీఎస్సీ బీఈడీ చదివింది.

దొరస్వామి టీచర్ ఉద్యోగం నుంచి త్వరలో రిటైర్ కానున్నారు. ఉద్యోగ విరమణతో వచ్చే డబ్బుతో .. తల్లి లేని బిడ్డకు వైభవంగా పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. కుప్పంలో ఓ కుటుంబంతో సంబంధం కుదిర్చారు. సుమారు రూ.80 లక్షల విలువ చేసే రెండు అంతస్తుల భవనం ఆస్తిని ఈ మధ్యనే తన కూతురుకు పసుపు కుంకుమగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆయనకు మద్యం అలవాటు ఉంది. బుధవారం రాత్రి మద్యం తాగి నిద్ర పోయారు. ఉదయం చూసే సరికి రక్తపు మడుగులో దొరస్వామి శవం కనిపించింది. మదనపల్లి పోలీసులకు ఈ సమాచారం అందింది. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వన్ టౌన్, తాలుకా సీఐలు వల్లి బసు , శేఖర్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కీలక ఆధారాలు సేకరించారు.

దొరస్వామిని కన్నకూతురే అత్యంత క్రూరంగా చంపిందని, ఇందుకు ఇద్దరు ప్రియులను వినియోగిందని తేలింది. కుమార్తె హరిత ఇంటిలోనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని చెప్పింది. ఆ సమయంలో ఘర్షణ, దెబ్బల శబ్ధం వినపడలేదా? అని అడిగారు. తన తండ్రి దొరస్వామిని తానే చంపానని హరిత పోలీసులకు తెలిపింది.

హారికకు ఇద్దరు ప్రియులు ఉన్నారు. పై అంతస్తులో రహస్యంగా సహజీవనం చేస్తుంది. రోజుకు ఒకరు పై అంతస్తుకు వస్తారు. కింది అంతస్తులోని దొరస్వామికి ఈ విషయాన్ని స్థానికులు తెలిపారు. దీంతో పెళ్లి చేసి పంపించాలని ఆయన నిర్ణయానికి వచ్చారు. వేరే వ్యక్తితో తనకు పెళ్లి వద్దని హరిత ఎదురు తిరిగింది. తండ్రి ఒప్పుకోలేదు. దీంతో అతడిని హతమార్చటానికి హరిత సిద్ధమైంది. ఒక ప్రియుడికి రూ.10 లక్షల సుఫారీ ఇచ్చి హతమార్చారు.

This post was last modified on June 14, 2024 5:47 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

10 నిమిషాలు.. జగన్ బాబుని చూసి నేర్చుకోవాలి

రాజ‌కీయాల‌కు.. మీడియాకు అవినాభావ సంబంధం. నేత‌లు ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాలన్నా.. మీడియానే వార‌ధి. ముఖ్యంగా అధికారంలో ఉన్న‌వారికి మీడియా మ‌రింత…

9 hours ago

బిగ్ బాస్ లోకి కుమారి ఆంటీ ?

దాసరి సాయి కుమారి అంటే మీకు తెలుసా ? ఖచ్చితంగా తెలిసి ఉండదు. కుమారి ఆంటీ తెలుసా అంటే మాత్రం…

9 hours ago

జ‌గ‌న్ అందుకే ఓడిపోయాడు: రాజా సింగ్

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయిన విష‌యం తెలిసిందే. క‌వేలం 11 స్థానాల‌కే ఆ పార్టీ ప‌రిమిత‌మై.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా…

9 hours ago

ఏపీ ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ బ‌హిరంగ లేఖ‌..!

ఏపీ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర డిప్యూటీ ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌హిరంగ లేఖ రాశారు. త్వ‌ర‌లోనే తాను బాధ్య‌త‌లు…

9 hours ago

అకీరా ఎంట్రీకి పెరుగుతున్న డిమాండ్

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఊపిరి సలపలేనంత బిజీ కావడం కళ్ళముందు కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రితో పాటు కీలక శాఖల బాధ్యతలు…

10 hours ago

భూములు మింగేశారా? బీఆర్ఎస్ నేత‌ల‌కు రేవంత్ టెన్ష‌న్‌

తెలంగాణ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌రుస ప‌రాభ‌వాల‌తో బీఆర్ఎస్ కుంగిపోయింది. ఏదో చేయాల‌ని, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని క‌ల‌లు…

10 hours ago