లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. దేశంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి బలమైన ప్రతిపక్షంగా నిలిచింది.
అయితే ప్రస్తుతం దేశంలో అతి చిన్న వయస్సు గల ఎంపీ ఎవరో తెలుసా ? సంజనా జాతవ్. ఆమె వయసు కేవలం 25 సంవత్సరాలు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున విజయం సాధించిన సంజనా జాతవ్ వయస్సు (25) 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్ కోలీపై విజయం సాధించింది.
దళిత వర్గానికి చెందిన సంజనా 18వ లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్న వయసు పార్లమెంటు సభ్యులలో ఒకరు. 2019లో మహారాజా సూరజ్మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జాతవ్ రాజస్థాన్‌లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కప్తాన్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో జాతవ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 23 లక్షలుగా రూ. 7 లక్షలు అప్పుగా ప్రకటించారు.
2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో జాతవ్ 409 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ ఖేడి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికలలో ఖాతా తెరవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి తాజాగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని 25 స్థానాలకు గాను బీజేపీ 14, కాంగ్రెస్ ఎనిమిది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పి), భారతీయ అఖిల్ కాంగ్రెస్ (బిఎసి) ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates