ది ఫ్యామిలీ స్టార్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే విజయ్ దేవరకొండ చేయబోయే తర్వాతి సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొనేవి. కానీ జరిగింది వేరు. మార్నింగ్ షోకు వచ్చిన టాక్ కంటే దారుణంగా ఫెయిల్ కావడం టీమ్ జీర్ణించుకోలేకపోతోంది. రౌడీ హీరో నెక్స్ట్ ప్రాజెక్టు దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్యాన్ ఇండియా మూవీ. స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగానే చేశారు. టైం ఎక్కువ దొరకడంతో మేజిక్ అనే చిన్న చిత్రాన్ని కొత్తవాళ్ళతో గౌతమ్ పూర్తి చేశాడు. రెండూ సితార బ్యానర్ లోనే రూపొందాయి. ఇంకేం విడి 12కి రూట్ క్లియరని అనుకోవడానికి లేదు.
డియర్ కామ్రేడ్ నుంచి ది ఫ్యామిలీ స్టార్ దాకా విజయ్ దేవరకొండ మార్కెట్ లో తగ్గుదల కనిపిస్తోంది. ఓటిటిలు కూడా ముందులాగా గుడ్డిగా రేట్లు ఆఫర్లు చేయడం లేదు. దీంతో నిర్మాతలు ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదనే భరోసా కలిగించుకోలేకపోతున్నారు. ఈ కారణంగా బడ్జెట్ లను రివైజ్ చేయాల్సి వస్తోంది. మొన్నటిదాకా పీ నట్స్ తీసుకున్నా, ఇకపై ఎక్కువ డిమాండ్ చేస్తాననే రీతిలో ఇంటర్వ్యూలలో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు దాన్ని మార్చుకోక తప్పదు. ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి లేదిప్పుడు. లాభాల్లో వాటా లేదంటే ఏరియా హక్కులు తీసుకోవడం లాంటి ఆప్షన్లు రావొచ్చు.
హీరోయిన్ ఎంపిక కూడా ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ లో చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపించింది కానిప ప్రేమలు మమిత బైజుని కూడా ట్రై చేస్తున్నారట. ఎవరిని ఫైనల్ చేస్తారో ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. స్పై తరహా బ్యాక్ డ్రాప్ లో గౌతమ్ తిన్ననూరి చాలా సీరియస్ డ్రామాని ప్రెజెంట్ చేయబోతున్నాడు. వంద కోట్లకు పైగా బడ్జెట్ కావొచ్చని నిర్మాత నాగవంశీ గుంటూరు కారం టైంలో అన్నారు కానీ అదే మాటకు కట్టుబడి ఉంటారో లేదో చూడాలి. ఎప్పుడు ప్రారంభమైనా విడి 12 రిలీజ్ మాత్రం 2025 వేసవిలో ఉంటుందని సమాచారం.
This post was last modified on April 14, 2024 7:10 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…