ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ఇది పాత విషయమే. ఎందుకంటే బుధవారమే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ప్రపంచంలో టాప్ 10 మంది అత్యంత సంపన్నుల్లో ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే.. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ముకేశ్ అంబానీ గొప్పతనం.. ఆయన సాధించిన ఘనతల్ని చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం. ఒక భారతీయుడిగా ముకేశ్ అంబానీ సాధించిన విజయాలకు అచ్చెరువు చెందకుండా ఉండలేం.
ప్రపంచ సంపన్నుల టాప్ 10 జాబితాలో నిలిచిన అంబానీ సాధించిన మరో ఘనత.. ఆసియా మొత్తంలో ఆయన ఒక్కరు మాత్రమే అత్యంత సంపన్నులు. మరెవరూ టాప్ 10 జాబితాలో లేరు. అంబానీ ఆస్తి 11,600 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో దగ్గర దగ్గర రూ.9.63 లక్షల కోట్లు. వరల్డ్ టాప్ 10లో ఏకైక ఆసియా సంపన్నుడు.. 10,000కోట్ల డాలర్లకు పైగా సంపద కలిగిన అతి కొద్ది మందిలో (ప్రపంచంలో పద్నాలుగు మందే ఉన్నారు) ఆసియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆయన ఒక్కడే.
భారతీయుడిగా ఆయన తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటం ఒక ఎత్తు అయితే.. ఆయన ఆసియా ఖండంలోనే మరెవరికి సాధ్యం కాని స్థాయికి చేరుకోవటం మాత్రం మామూలు విషయం కాదని చెప్పాలి. గత ఏడాది తెర మీదకు వచ్చిన హిండెన్ బర్గ్ రిపోర్టుకు ముందు అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ అత్యంత సంపన్నుడిగా తెర మీదకు రావటం తెలిసిందే. అయితే.. హిండెన్ బర్గ్ రిపోర్టు తర్వాత సమీకరణాలు మారిపోవటం తెలిసిందే. తాజాగాఆయన ఆస్తిని 8,400 కోట్ల డాలర్లుగా లెక్కించారు. హెండెన్ బర్గ్ పంచాయితీ తర్వాత ఏడాది కాలంలో ఆయన ఆస్తి 3,680 కోట్ల డాలర్లు పెరిగినట్లుగా చెబుతున్నారు.
ఫోర్భ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 200 మంది భారతీయులకు స్థానం దక్కింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే గత ఏడాది ఈ జాబితాలో 169 మంది భారతీయులకు చోటు దక్కితే.. ఈసారి గణనీయంగా పెరిగింది. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద రూ.79.18 లక్షల కోట్లు కావటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే 41 శాతం అధికం కావటం విశేషం. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడు నిఖిల్ కామత్. అతడి వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే. ఆన్ లైన్ బ్రోకింగ్ సేవల సంస్థ జీరోథా వ్యవస్థాపకులైన నితిన్.. నిఖిల్ కామత్ ఇద్దరూ సోదరుడు. వీరిలో నిఖిల్ చిన్నోడు. ఈ ఏడాది వీరు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
This post was last modified on April 6, 2024 11:04 am
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…
నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా…
జాతీయ స్థాయిలో పుష్ప 2 సత్తా చాటాక టాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోంది. మూడేళ్ళకు…