Trends

యాపిల్ విషం.. 600 మంది ఉద్యోగుల తొలగింపు

అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ టెక్‌ సంస్థ యాపిల్ సంస్థ‌.. విషం చిమ్మింది. ఉద్యోగుల‌ను ఉన్న‌ప‌ళంగా ఉద్యోగాల నుంచి తీసేసి ఇంటికి పంపించేసింది. దీంతో 600 మంది ఉద్యోగులు ఇంటికే ప‌రిమితం అయ్యారు. కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ ప్లే ప్రాజెక్టులను నిలిపివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేసింది.

కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్ విభాగం ‘కుపెర్టినో’ ఎనిమిది వేర్వేరు రిపోర్టుల ద్వారా విషయాన్ని తెలియజేసింది. వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ ప్రోగ్రామ్‌కు అనుగుణం గా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వివరించింది. ఉద్యోగులను తొలగించే కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీకి తప్పనిసరిగా రిపోర్ట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే యాపిల్ త‌న ఉద్యోగుల వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న ప్రధాన కార్యాలయంలో 371 మంది ఉద్యోగులను తొలగించింది. అదేవిధంగా పలు శాటిలైట్ ఆఫీస్‌లలో డజన్ల సంఖ్యలో ఉద్యోగులు ఇంటిముఖంప‌ట్టారు. అయితే.. సీనియ‌ర్లు, ప‌నిఒత్తిడికి గురికాకుండా ప‌నిచేస్తున్న కొంత మందిని మాత్రం వేరే గ్రూపుల్లో చేర్చి..వారికి వేత‌నాల్లోకోత పెట్టింది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో కార్లు, స్మార్ట్‌వాచ్ ప్రాజెక్ట్‌ల నిలిపివేత ప్రక్రియను యాపిల్ కంపెనీ ప్రారంభించింది. ప్రాజెక్టుల వ్యయాలు, నిర్వహణ సవాళ్లపై ఆందోళనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఒకే సారి 600 మంది ఉద్యోగాలు కోల్పోవ‌డంతో ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌లో బైడెన్ స‌ర్కారుపై ప్ర‌భ‌వం ప‌డుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు.. ఈ 600 మంది ఉద్యోగుల్లో 50 – 100 మంది భార‌త సంత‌తి వ్య‌క్తులు ఉన్నార‌ని స‌మాచారం.

This post was last modified on April 6, 2024 7:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago