ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. ఈ జట్టుకు కేవలం బెంగళూరులోనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు ప్రధాన కారణం లీగ్ ఆరంభం నుంచి ఈ జట్టుకు విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తుండడం.
కోహ్లి అనే కాక క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ఎంటర్టైనర్లు ఈ జట్టుకు ఆడడం వల్ల ఎప్పుడూ ఈ జట్టు అట్రాక్షనే వేరుగా ఉంటుంది. కానీ స్టార్లతో కళకళలాడే ఆ జట్టు ప్రదర్శన మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటిదాకా లీగ్‌లో టైటిల్ కల నెరవేరని జట్లలో అదొకటి. హై ప్రొఫైల్ జట్టుగా పేరుండి.. ఫ్యాన్ ఫాలోయింగ్, అంచనాలకు ఎప్పుడూ కొదవ లేని ఈ జట్టు కప్పు గెలవడంలో మాత్రం ప్రతిసారీ బోల్తా కొడుతూనే ఉంటుంది. సీజన్ ఆరంభమవుతుంటే.. ‘ఈసాలా కప్ నమ్‌దే’ అని అభిమానులు హడావుడి చేయడం.. తీరా ప్రదర్శన అంచనాలకు తగ్గట్లు లేక ఆ జట్టు చతికిలపడడం మామూలే.
ఫైనల్ చేరి కప్పు కోసం పోటీ పడడం సంగతి అటుంచితే.. కొన్నేళ్లుగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరడానికి కూడా కష్టాలు పడుతోంది. చూడ్డానికి సాధారణంగా అనిపించే జట్లు, పెద్దగా స్టార్లు లేని టీమ్స్ కూడా ఐపీఎల్‌లో అదరగొడుతుంటాయి. కానీ ఆర్సీబీ మాత్రం తడబడుతూనే ఉంటుంది. ఆ జట్టు మ్యాచ్ అంటే చాలు.. సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు పండగన్నట్లే. ఆర్సీబీ బాగా ఆడి మ్యాచ్ గెలిచినా.. ఒక్క విజయానికే కప్పు గెలిచినట్లు ఫీలైపోతున్నారని ట్రోల్ చేస్తారు. మ్యాచ్ ఓడితే ఇక అంతే సంగతులు. మీమ్స్ మోత మోగిపోతాయి. ఆర్సీబీ మ్యాచ్ లేని రోజు కూడా వాళ్లకు ట్రోలింగ్ తప్పదు.
పురుషుల ఐపీఎల్ మొదలవడానికి ముందు మహిళల లీగ్‌లో ఆర్సీబీ టైటిల్ గెలిస్తే.. కొన్ని రోజుల పాటు పురుషుల జట్టును ట్రోల్ చేశారు. ఇక లీగ్ ఆరంభమయ్యాక ప్రతి మ్యాచ్‌లోనూ ఆర్సీబీకి ట్రోలింగ్ మోత తప్పట్లేదు. గత వారం సన్‌రైజర్స్.. ఆర్సీబీ పేరిట ఉన్న ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ రికార్డును బద్దలు కొట్టింది. కప్పు లేకున్నా రికార్డుందనుకుంటే దాన్నీ లేకుండా చేశారంటూ ట్రోల్ చేశారు. తాజాగా కోల్‌కతా జట్టు సైతం ఆర్సీబీ స్కోరును అధిగమించింది. దీంతో మళ్లీ ఆర్సీబీకి ట్రోలింగ్ తప్పట్లేదు. ఇలా ఎవరెలా ఆడినా.. లీగ్‌లో ఏం జరిగినా ఆర్సీబీ ట్రోల్ అవుతూనే ఉంది.
This post was last modified on April 4, 2024 9:43 am
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది.…
ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ…
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…