తెలుగు యువతకు అత్యంత నచ్చిన రెండు విషయాలు.. సినిమా, క్రికెట్. సోషల్ మీడియాలో మన నెటిజన్ల చర్చలు ప్రధానంగా వీటి చుట్టూనే తిరుగుతాయి. మీమ్స్, జోక్స్ అన్నీ కూడా ప్రధానంగా వీటి చుట్టూనే తిరుగుతుంటాయి.
ఇక ఐపీఎల్ టైం వచ్చిందంటే క్రికెట్, సినిమాలు మిక్స్ చేసి ఎడిట్ల మోత మోగిస్తుంటారు మన నెటిజన్లు. ఇందుకోసం హీరోలు, కమెడియన్లనే కాదు.. హీరోయిన్లను కూడా బాగానే ఉపయోగించుకుంటారు. తాజా కాజల్ అగర్వాల్‌కు, ఐపీఎల్ జట్లకు ముడిపెట్టి రెడీ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాజల్ వివిధ సినిమాల్లో ధరించిన రంగు రంగు దుస్తుల ఫొటోలు పట్టుకొచ్చి ఐపీఎల్ జట్ల రంగులకు మ్యాచ్ చేసి తాయరు చేసిన ఎడిట్స్ వేరే లేవెల్ అనే చెప్పాలి. చందమామ మంచి ఫాంలో ఉన్న టైంలో చేసిన సినిమాలకు సంబంధించిన ఆ లుక్స్ సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి.
ఈ ఫొటోలు చూస్తే కాజల్ ఐపీఎల్‌లో ఉన్న పది జట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసిందా అని ఆశ్చర్యం కలగక మానదు. అంత బాగా ఆ ఫొటోలు సింక్ అయ్యాయి. ఈ ఎడిట్స్ చేసిన టెక్నీషియన్ ఎవరో కానీ.. తన టాలెంట్‌ని అభినందించాల్సిందే
This post was last modified on March 23, 2024 12:28 am
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…