Trends

‘సంతోషం’లో మనమెక్కడ?

మరో ఆసక్తికర రిపోర్టు వచ్చింది. దాన్ని చదివినప్పుడు ఒకలాంటి నిరాశ కమ్మేస్తుంది. దీనికి కారణం భారతదేశం దూసుకెళుతుందన్న పాలకుల మాటకు భిన్నంగా ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశాల్లో మన ర్యాంక్ అత్యంత దారుణంగా ఉండటమే దీనికి కారణం. అంతర్జాతీయ ఆనంద దినోత్సవంగా మార్చి 20ను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో యూఎస్ కు చెందిన ఒక సంస్థ తాజాగా జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. సంతోష సూచీల్లో ప్రపంచంలోని 143 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు.

మొదటి మూడు ర్యాంకుల్ని ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్ లాండ్ నిలిచాయి. మరి.. భారతదేశ ర్యాంక్ ఎంత? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే నిరాశకు గురి చేస్తుంది. కారణం.. మన ర్యాంక్ 126. ఇక్కడే మరో అంశాన్ని చెప్పాలి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మన ర్యాంక్ ఒక స్థానం కిందకు దిగజారింది. ఈ జాబితాలో అట్టడుగున అప్గానిస్థాన్ నిలిచింది. మన దాయాది పాకిస్థాన్ సైతం మన కంటే ఎంతో మెరుగైన స్థానంలో నిలిచింది. పాక్ ర్యాంక్ 108 అయితే.. నియంత ఏలుబడిలో ఉన్న మయన్మార్ సైతం మనకంటే మెరుగైన స్థానం (118)లో ఉండటం విశేషం.

ఇంతకూ ఈ జాబితాను ఎలా రూపొందిస్తారు? అన్నది చూస్తే.. ఆత్మసంతృప్తి.. తలసరి జీడీపీ.. సామాజిక మద్దతు.. జీవనకాలం.. వారి జీవితాల్లో వారికి ఉండే స్వేచ్ఛ.. దాత్రత్వం.. అవినీతి అంశాల ఆధారంగా ఈ లిస్టును ప్రిపేర్ చేస్తారు. ఈ జాబితాలో కోస్టారికా.. కువైట్ దేశాలు తొలిసారి టాప్ 20కు చేరితే.. అమెరికా.. జర్మనీ దేశాలు తొలిసారి టాప్ 20 స్థానా నుంచి కిందకు దిగటం గమనార్హం. జాబితాలోని తొలి పది దేశాల్లో పెద్ద దేశం ఏదీ లేకపోవటం గమనార్హం. మొదటి పది దేశాల్లో ఒకటిన్నర కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు నెదర్లాండ్స్.. ఆస్ట్రేలియా మాత్రమే. టాప్ 20లో మాత్రం కెనడా.. యూకే దేశాలు మాత్రమే మూడు కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన దేశాలు.
అత్యంత సంతోషకరన దేశాల్లో టాప్ 10 కంట్రీస్ ను చూస్తే..
ర్యాంక్ దేశం
— 01 ఫిన్లాండ్
— 02 డెన్మార్క్
— 03 ఐస్ ల్యాండ్
— 04 ఇజ్రాయల్
— 05 నెదర్లాండ్స్
— 06 స్వీడన్
— 07 నార్వే
— 08 స్విట్జర్లాండ్
— 09 లగ్జంబర్గ్
— 10 న్యూజిలాండ్

ప్రపంచంలోనే అత్యంత సంతోషమైన దేశంగా నిలిచిన ఫిన్లాండ్ విషయానికి వస్తే.. అదెలా సాధ్యమవుతోంది? వారంత ఆనందంగా ఎలా ఉంటున్నారన్న విషయాన్ని పరిశీలిస్తే.. అక్కడి ప్రజలు నేచర్ కు దగ్గరి సంబంధం కలిగి ఉండటం.. ఆరోగ్యకరమైన వర్కు లైఫ్ బ్యాలెన్స్ కారణంగా చెబుతున్నారు. జీవితంలో విజయం అనే అంశంపై అక్కడి ప్రజల్లో మెరుగైన అవగాహన ఉందని చెబుతారు. అమెరికా లాంటి దేశాల్లో ఆర్థిక ఎదుగుదలను జీవితంలో విజయానికి ముడి పెడతారని.. ఫిన్లాండ్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యవస్థల మీద విశ్వాసం.. చాలా తక్కువ స్థాయిలో అవినీతి.. ఉచిత ఆరోగ్య సంరక్షణ.. విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి కారణంగా చెబుతున్నారు. ఇక్కడే మరో ఆసక్తికర విషయాన్ని చెప్పాలి.

అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో మెరుగైన ర్యాంకుల్లో ఉన్న ప్రజల్లో ఎవరు సంతోషంగా ఉన్నారంటూ మరింత లోతుగా పరిశీలిస్తే..కొన్ని దేశాల్లో కొన్ని వయస్కుల వారు సంతోషంగా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. పెద్ద వయస్కుల వారితో పోలిస్తే తక్కువ వయసున్న వారే ఆనందంగా ఉన్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. అయితే.. ఇలాంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఒకేలా లేదని చెబుతున్నారు. ఉత్తర అమెరికా.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ దేశాల్లో 30 ఏల్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గిందని.. అక్కడ పెద్ద వయస్కులే ఆనందంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందుకు భిన్నంగా మధ్య.. తూర్పు యూరప్ లో మాత్రం అన్ని వయస్కుల వారి సంతోషం పెరిగినట్లుగా వెల్లడించారు. పశ్చిమ యూరప్ లోని అందరూ ఒకేస్థాయి ఆనంద స్థాయిల జీవనాన్ని అనుభవిస్తున్నట్లుగా తేలింది. సంతోషకర స్థాయిలో తేడాలు ఒక్క ఐరోపా మినహా ప్రపంచ వ్యాప్తంగా పెరిగినట్లుగా వెల్లడైంది.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. ధనిక దేశాలు సంతోషంగా.. పేద దేశాలు అందుకు భిన్నంగా ఉంటాయన్న ఆలోచన తప్పన్న విషయాన్ని నివేదిక స్పష్టం చేసింది. పేద దేశంగా పేరున్న ఇండోనేషియా 80వ ర్యాంకులో ఉంది. అదే సమయంలో బలమైన ఆర్థిక దేశంగా పేర్కొనే చైనా 82వ ర్యాంకులో నిలిచింది. మన కంటే పేద దేశంగా పేరున్న బంగ్లాదేశ సైతం సంతోషంలో 99వ ర్యాంకులో ఉంటే మనం మాత్రం ఏకంగా 125 ర్యాంకులో నిలవటం గమనార్హం.

This post was last modified on March 20, 2024 3:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుప‌తి క్యూలైన్లో తోపులాట‌.. ఎంత మంది చనిపోయారు

ఈ నెల 10 శుక్ర‌వారం నాడు వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌త్యేక స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల పంపిణీని…

3 minutes ago

న‌మో-న‌మో-న‌మో.. నారా లోకేష్ 21 సార్లు!

ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ త‌న ప్ర‌సంగంలో ఏకంగా 21 సార్లు న‌మో అనే ప‌దాన్ని…

19 minutes ago

మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…

22 minutes ago

తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…

2 hours ago

ఏపీకి ప్ర‌ధాని ఇచ్చిన వ‌రాల ప్రాజ‌క్టులు ఇవీ..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు గంటున్న ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ…

2 hours ago

ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ డిమాండ్ చూశారా

మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…

3 hours ago