హీరోయిన్ల కెరీర్లు ఉన్నట్లుండి ఊపందుకుంటాయి. అలాగే ఉన్నట్లుండి డౌన్ అయిపోతాయి. ఒకసారి డౌన్ అయ్యాక మళ్లీ పుంజుకోవడం అంత తేలిక కాదు. కొన్నేళ్ల పాటు వైభవం చూసిన హీరోయిన్లు ఉన్నట్లుండి కనుమరుగైపోతుంటారు.
ఒక ఐదారేళ్ల పాటు టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ హోదాను అనుభవించిన పూజా హెగ్డేకు ఉన్నట్లుండి కాలం కలిసి రాలేదు. వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. దీంతో చేతిలో ఉన్న మంచి అవకాశాలు చేజారాయి. కొత్త అవకాశాలు ఆగిపోయాయి. కొన్ని నెలలుగా టాలీవుడ్లో పూజా పేరే వినిపించడం లేదు. ఇక మళ్లీ తెలుగులో పూజా ఓ పెద్ద సినిమాలో నటించడం అంటే కష్టమే అని భావిస్తున్న సమయంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో ఆమె భాగం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
తెలుగులో పూజా కెరీర్ మలుపు తిరిగింది అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాథంతో. మళ్లీ బన్నీ మూవీతోనే ఆమె మరో బ్రేక్ అందుకోనుందని అంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ ఓ సినిమా చేయబోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ బేనర్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుందట. ఈ చిత్రంలో పూజానే హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. కెరీర్లో ఈ దశలో పూజాకు ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం రావడం అంటే ఆశ్చర్యమే. సన్ పిక్చర్స్‌లో ఆల్రెడీ పూజా బీస్ట్ మూవీ చేసింది. కానీ అది డిజాస్టర్ కావడంతో తమిళంలో ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. ఇటు తెలుగులో కూడా ఆమె డౌన్ అయింది. మరి నిజంగా పూజా.. అట్లీ-బన్నీ మూవీ నటించబోతోందంటే.. ఆమె కెరీర్‌కు మళ్లీ ఓ లైఫ్ లైన్ దొరికినట్లే.
This post was last modified on March 16, 2024 7:22 am
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…