‘క్ష‌మించ‌ండి.. నేనొక్క‌డినే వెళ్లి చేరిపోతా’

ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేరిక విష‌యంపై కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తాజాగా మ‌రో లేఖ సంధించారు. ఆయ‌న తాజాగా రాసిన లేఖ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నేను ర‌మ్మన్నాన‌ని.. చాలా మంది వ‌చ్చేందుకు రెడీ అయిపోయారు. అయితే, ఇంత మంది వ‌స్తే.. అక్క‌డ‌(తాడేప‌ల్లి) ఏర్పాట్లు చేసేందుకు ఇబ్బంది అవుతుందంట‌. అందుకే మీరెవ‌రూ రావొద్దు.. నేనే వెళ్లి జాయిన్ అయిపోతాను. అని తాజాగా ముద్ర‌గ‌డ లేఖ‌లో పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీలో చేరిక ఖ‌రారైన విష‌యం తెలిసిందే. ఈ నెల 14న ఆయ‌న మూహూర్తం పెట్టుకుని.. త‌న అభిమానులు, అనుచ‌రులు కూడా త‌న వెంట వ‌చ్చేవారు రావాల‌ని పిలుపునిచ్చారు. అయితే.. ఎవ‌రి భోజ‌నాలు, ఖ‌ర్చులు వారే పెట్టుకోవాల‌ని మంచినీళ్లు కూడా వెంట తెచ్చుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. దీనిపై నెటిజ‌న్ల నుంచి స‌టైర్లు కూడా పేలాయి. ఇదిలావుంటే.. తాజాగా రాసిన లేఖ‌లో ఆయ‌న చిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

ముద్ర‌గడ తాజా లేఖ ఇదీ..

“గౌర‌వ ప్ర‌జ‌ల‌కు మీ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం శిర‌స్సు వంచి న‌మ‌స్కార‌ముల‌తో క్ష‌మించ‌మ‌ని కోరుకుంటున్నాను. 14.03.2024 తేదీన గౌర‌వ ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి వ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిలుపు మేర‌కు వైఎస్ఆర్‌సీపీలోకి మీ అంద‌రి ఆశీస్సుల‌తో వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియ‌ప‌ర్చి ఉన్నానండి. ఊహించిన దానిక‌న్నా భారీ స్థాయిలో స్పంద‌న రావ‌డం మీద‌ట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వ‌ల్ల ఎక్కువ మంది వ‌స్తే కూర్చోడానికి కాదు, నిల‌బ‌డ‌డానికి కూడా స్థ‌లం స‌రిపోద‌ని మ‌రియు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని చెక్ చేయ‌డం చాలా ఇబ్బంద‌ని చెప్ప‌డం వ‌ల్ల తాడేప‌ల్లికి మ‌న‌మంద‌రం వెళ్లే కార్య‌క్ర‌మం ర‌ద్దు చేసుకున్నానండి. మిమ్మ‌ల్ని నిరుత్సాహ‌ప‌ర్చినందుకు మ‌రొకసారి క్ష‌మాప‌ణ కోరుకుంటున్నానండి. ఈ నెల 15 లేక 16వ తేదీల‌లో నేను ఒక్క‌డినే తాడేప‌ల్లి వెళ్లి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలోకి చేర‌తానండి. మీ అంద‌రి ఆశీస్సులు వారికి, నాకు త‌ప్ప‌కుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి”

This post was last modified on March 13, 2024 5:07 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: ఫ‌స్ట్ టైం మోడీ.. రాజీవ్ జ‌పం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నోటి వెంట కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు, దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ జపం వినిపించింది.…

23 mins ago

సినీ ప్రపంచం కళ్ళన్నీ కల్కి వేడుక మీదే

రేపు సాయంత్రం కల్కి 2898 ఏడి ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. సుమారు…

1 hour ago

కవితకు బెయిల్ ఎందుకు రావడం లేదు ?

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితరులు అరెస్టయ్యారు.…

2 hours ago

వెంకటేష్ సినిమాలో మంచు మనోజ్

ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి వరస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో…

2 hours ago

బొత్స ‘ముహూర్తం’ పెట్టారు.. వైవీ ‘స‌మ‌యం’ నిర్ణ‌యించారు!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాట‌లే కాదు.. ఆశ‌లు కూడా కోట‌లు దాటుతున్నాయి. ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్‌లో…

3 hours ago

చిల్ అయిన హేమ .. ఫైర్ అయిన పోలీసులు !

బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ దొరికిందని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో…

3 hours ago