డార్లింగ్…..సాధారణంగా చాలామంది తమ స్నేహితులను, సన్నిహితులు, ప్రేమించేవారిని పిలిచే పిలుపు. ఇక, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ అని పేరుంది. ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ ని, కొంతమంది కో స్టార్స్ ని ప్రేమగా, అభిమానంగా డార్లింగ్, డార్లింగ్స్ అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో పాటు డార్లింగ్ అని పిలిచే చాలామందికి కోర్టు షాకిచ్చింది. అపరిచితులను డార్లింగ్ అని పిలవకూడదంటూ కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘డార్లింగ్’ అనే పదానికి లైంగిక అర్థం ఉందని, సెక్షన్ 354ఏ(1) (4) కింద అది అభ్యంతరకరమైన వ్యాఖ్య కిందకు వస్తుందని జస్టిస్ జే సేన్ గుప్తా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పరిచయం లేని అమ్మాయిలను ‘డార్లింగ్’ అని పిలవడం లైంగిక వేధింపు కిందకు వస్తుందని స్పష్టం చేసింది. అపరిచితులను డార్లింగ్.. అని పిలిచిన వారిని సెక్షన్ 354ఏ, 509 కింద నిందుతులుగా భావించ వచ్చు అని పేర్కొంది.
గతంలో ఓ మహిళా కానిస్టేబుల్ ను మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ‘డార్లింగ్’ అని పిలిచాడు. చలానా రాయడానికి వస్తున్నావా డార్లింగ్ అంటూ డ్యూటీలో ఉన్న ఆ లేడీ కానిస్టేబుల్ పై అతడు చేసిన వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు పెట్టారు. ఈ ప్రకారం ఆ కేసుపై విచారణ జరిపిన కోర్టు…ఈ మేరకు వ్యాఖ్యానించింది. పరాయి స్త్రీలను ఇష్టం వచ్చినట్లు పిలిచే స్థాయికి భారత్ దిగజారలేదని పేర్కొంది.
అయితే, కోర్టు తీర్పుతో ప్రభాస్ పై మీమ్స్ వస్తున్నాయి. అభిమానులతో మాట్లాడేటపుడు, సక్సెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో అభిమానులను డార్లింగ్ అని సంబోధించే ప్రభాస్….ఇకపై అలా పిలవాలంటే ఆలోచించుకోవాలేమో అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. డార్లింగ్ పరిస్థితి ఇది అంటూ…ఫన్నీ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. తాను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తున్నానో తనకూ తెలీదని ప్రభాస్ చెబుతూ…పలు మార్లు డార్లింగ్ అని పిలిచిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇకపై ప్రభాస్ డార్లింగ్ అని పిలవడేమో అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on March 4, 2024 5:39 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…