పంజాబ్‌లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవరు లేని ఒక గూడ్స్ రైలు వంద కిలోమీటర్ల వేగాన్నందుకుని పట్టాల మీద దూసుకెళ్లగా అదృష్టవశాత్తూ ఆ మార్గంలో ప్రయాణికులున్న ఏ రైలూ రాకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అతి కష్టం మీద ఆ రైలుకు అడ్డుకట్ట వేసిన రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సంచలనం రేపిన ఈ ఉదంతం గురించి తెలుసుకుందాం పదండి.
జమ్ము కశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్లలో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడ్‌తో ఓ గూడ్స్ రైలు పంజాబ్‌కు బయల్దేరాల్సి ఉంది. ఐతే కథువా రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును ఆపిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్.. హ్యాండ్ బ్రేక్ వేయకుండా బయటికి వెళ్లారు. మామూలుగా అయితే రైలు దానికదే ముందుకు కదలదు. కానీ పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ ఏటవాలుగా ఉండడంతో రైలు ముందుకు కదిలింది. ముందుకు సాగేకొద్దీ వేగం పెరిగిపోయింది. ఏకంగా 100 కిలోమీటర్ల వేగాన్నందుకుని రైలు ముందుకు దూసుకెళ్లింది. మధ్య మధ్యలో స్టేషన్ల వద్ద రైలు శరవేగంగా దూసుకెళ్తున్న వీడియోలు బయటికి వచ్చాయి.
ఐతే కథువా నుంచి రైలు ముందుకు వెళ్లిపోయిన విషయాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించిన లోకో పైలట్ తర్వాతి స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆ మార్గంలో అదృష్టం కొద్దీ ఏ రైలు ప్రయాణించడం లేదు. రైలు 100 కిలోమీటర్ల వేగంతో 84 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషణ్ వద్ద చెక్కదిమ్మెలు అడ్డుపెట్టి రైలును ఆపాల్సి వచ్చింది. ఆఖరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలు ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రమాదాలు చాలా వరకు ఇలాంటి మానవ తప్పిదాలతోనే జరుగుతుంటాయి. ఆ రైలు మార్గంలో ఏదైనా ప్రయాణికుల రైలు ప్రయాణించి ఉంటే జరిగే నష్టం గురించి ఊహించుకోవడం కూడా కష్టమే.
This post was last modified on February 26, 2024 8:07 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు.…
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…