Trends

మీ ఆయ‌న‌కు నెల‌నెలా 5 వేలు ఇవ్వండి:  కోర్టు తీర్పు

“మీ ఆయ‌న‌పై మీరు చేసిన ఆరోప‌ణ‌లు.. నిజం కాద‌ని తేలిపోయింది. ఆయ‌న మిమ్మ‌ల్ని హింసించ‌డం కాదు.. మీరే ఆయ‌న‌ను మాన‌సికంగా హింసించారు. దీనికి ప‌రిహారంగా.. ఆయ‌న కు నెల‌నెలా 5 వేల చొప్పున భ‌రణం చెల్లించండి. ఇదే ఫైన‌ల్‌“- అని ఓ భార్య‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.  దీంతో స‌ద‌రు భార్య బిక్క మొహం వేసుకుని కోర్టునుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది.

ఏం జ‌రిగింది?

వివాహితుల ర‌క్ష‌ణ కోసం.. 2006లో అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం గృహ హింస(డొమెస్టిక్ వ‌య‌లెన్స్‌) చ‌ట్టం తీసుకువ‌చ్చింది. భ‌ర్త‌లు.. భార్య‌ల‌పై దాడులు చేసినా.. అద‌న‌పు క‌ట్నం కోసం వేధించినా.. తిండి పెట్ట‌కుండా.. పోష‌ణ చూడ‌కుండా మ‌ల‌మలా మాడ్చిన సంద‌ర్భాల్లో ఈ చ‌ట్టం వారికి భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది. అంతేకాదు.. ఆడ‌ప‌డుచులు, అత్త‌మామ‌ల వేధింపుల నుంచి కూడా ఈ చ‌ట్టం ర‌క్ష‌ణ క‌వ‌చంగా మారింది. ఇక‌, భ‌ర్త వేరేవారితో సంబంధాలు పెట్టుకుని.. త‌న‌ను చూడ‌కుండా పోయినా.. స‌ద‌రు భార్య కోర్టును ఆశ్ర‌యించి.. ర‌క్ష‌ణ పొందే అధికారం ద‌క్కుతుంది.

వివాదాలు..

అయితే.. గృహ హింస చ‌ట్టం కింద‌.. దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో అనేకం.. ఉద్దేశ పూర్వ‌కంగా భ‌ర్త‌ల‌ను వేధించేందుకే కేసులు పెడుతున్నారంటూ.. కొన్నాళ్లుగా వివాదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒకానొక సంద‌ర్భంలో సుప్రీంకోర్టు కూడా దీనిని త‌ప్పుబ‌ట్టింది. మ‌హిళ‌ల‌కు వ‌రంగా ఉన్న ఈ చ‌ట్టాన్ని దుర్వినియోగం చేసేవారికి క‌ఠిన శిక్ష‌లు ఉండేలా మార్పులు చేస్తే మంచిదేమో న‌ని వ్యాఖ్యానించింది. అయితే.. ఇది అక్క‌డితో ఆగిపోయింది.

తాజా కేసులో..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని ప్రాంతానికి చెందిన ఆమ‌న్ 2021లో ఓ యువ‌తిని వివాహం చేసుకున్నారు. ఆమె ఉద్యోగి. అయితే.. ఆమె అంత‌కు ముందే ఒక‌రిని ప్రేమించిన‌ట్టు భ‌ర్త తెలుసుకున్నాడు. దీంతో ఆమెను ప‌లుమార్లు ప్ర‌శ్నించినా.. మార్పు రాలేదు. త‌నే స‌ర్దుకుపోతున్నాడు. అయితే.. క‌లిసి ప‌డుకునేందుకు.. క‌లిసి భోజ‌నం చేసేందుకు కూడా ఆమె అవ‌కాశం ఇవ్వ‌కుండా.. నిత్యం వేధింపుల‌కు గురి చేసింది. దీంతో ఆమ‌న్ ఆమెను ఒంట‌రిగా విడిచి పెట్టి.. త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వెళ్లిపోయాడు. దీంతో ఆమె.. స్థానిక కోర్టులో త‌న భ‌ర్త‌పై కేసు పెట్టింది. రోజూ తాగి వ‌చ్చి త‌న‌ను కొడుతున్నాడ‌ని.. మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని పేర్కొంది. దీనిని విచారించిన ఇండోర్ కోర్టు.. ఆమె చెబుతున్న దానికి సాక్షులు చెబుతున్న దానికి పొంత‌న లేక‌పోవ‌డం.. ఆమ‌న్‌కు మ‌ద్యం తాగే అల‌వాటు లేద‌ని వైద్యులు స‌ర్టిఫికెట్ కూడా ఇవ్వ‌డంతో నెల‌నెలా భ‌ర్త‌కు 5 వేల‌చొప్పున భ‌రణం ఇవ్వాలంటూ.. సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

42 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

48 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago