వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఇస్తున్న కనీస మద్దతు ధరలకు చట్ట బద్ధత కల్పించాలని.. రైతులకు, కూలీలకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతు ఉద్యమం… రక్త సిక్తమైంది. హరియాణ, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో యువ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో రైతులు తిరగుబాటు చేశారు. చేతికి అందివచ్చిన వస్తువుతో పోలీసులపై దాడులు ముమ్మరం చేశారు.
ఏం జరిగింది?
స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధతకల్పించాలని కోరుతూ.. గత 10 రోజులుగా పంజాబ్, హర్యాణా రైతులు.. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తును ఉద్యమిస్తున్నారు. దీంతో ఏకంగా.. రైతులను నిలువరిం చేందుకు హరియాణా ప్రభుత్వం రహదారులపై గోడలే నిర్మించేసింది. అదేసమయంలో కేంద్ర బలగాలను తీసుకువచ్చి.. పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించింది. అయినప్పటికీ.. రైతులు వెనక్కి తగ్గలేదు. తమ ఆందోళనను మరింత తీవ్ర తరం చేశారు. ఒకానొక దశలో రైతుల ఉద్యమాన్ని నీరు గార్చేలా వారిపై విమర్శలు, మద్యం తాగుతున్నారన్న వీడియోలు కూడా హల్చల్ చేశాయి.
ఇక, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ పరిణామాలను నిశితంగా గమనించి.. 4 సార్లు చర్చలు జరిపింది. అయితే.. రైతుల డిమాండ్లను యథాతథంగా మాత్రం అంగీకరించలేదు. కేవలం కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఐదేళ్ల పాటు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుందామని ఒకప్రతిపాదనను తీసుకువచ్చింది. దీనిలో మోసం ఉందన్న రైతులు.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. పలితంగా మరోసారి ఉద్యమం తెరమీదకి వచ్చింది. బుధవారం ఉదయం నుంచి హరియాణ, పంజాబ్ నుంచి దారి తీసే ఢిల్లా సరిహద్దులు.. ఉద్రిక్తంగా మారాయి.
అయితే.. ఉద్యమంలో ఉన్న రైతులను పోలీసులు కవ్వించారని.. వెనక్కి వెళ్లిపోవాలంటూ.. వారిని హెచ్చరించారని వార్తలు వచ్చాయి. అసలే ఆగ్రహంతో ఉన్న రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు జరిగిన కాల్పుల్లో 24 సంవత్సరాల శుభ్ కరణ్ సింగ్ అనే రైతు ఉద్యమకారుడు తీవ్రమైన గాయాలపాలై మృతి చెందాడు. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రజా సంగాలు నిప్పులు చెరుగుతున్నాయి.
This post was last modified on February 21, 2024 10:45 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…