ఆ మధ్య సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో త్రిషతో నటించడం గురించి అభ్యంతరకరమైన కామెంట్లు చేసి దుమారం రేపడం చూశాం. ఆమెకు మద్దతుగా మాట్లాడినందుకు చిరంజీవి, ఖుష్భూ తదితరుల మీద కేసు పెట్టి కోర్టు చేత చీవాట్లు తిన్న ఘనత కూడా ఇతనికే చెల్లింది. అభిమానులతో సహా ఈ విషయంలో ప్రేక్షకులందరూ త్రిషకు పూర్తి మద్దతు తెలిపారు. పొన్నియిన్ సెల్వన్ నుంచి వరస అవకాశాలతో త్రిష బిజీగా మారింది. చిరంజీవి, కమల్ హాసన్, అజిత్ లాంటి అగ్ర హీరోలతో ప్యాన్ ఇండియా మూవీస్ లో భాగమవుతోంది. అందుకే కొందరు ఓర్వలేకపోతున్నారు.
తాజాగా తమిళనాడు ఏఐఐడిఎంకె పార్టీకి చెందిన ఏవి రాజు అనే మాజీ నాయకుడు త్రిష మీద నోరు పారేసుకోవడం కలకలం రేపుతోంది. భారీ మొత్తంలో సొమ్ము ముట్టజెప్పడం గురించి మాట్లాడుతూ ఆమె గురించి అనవసరంగా కామెంట్ చేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు భగ్గుమంటున్నాయి. అతను ఏం చెప్పాడనేది వివరించలేనంత అసహ్యంగా ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత దిగజారుడుగా వ్యవహరించాడో. ఈ వివాదంపై త్రిష ట్విట్టర్ వేదికగా భగ్గుమంది. మనుషులు ఇంత దిగజారి ప్రవర్తిస్తారని ఎప్పుడూ అనుకోలేదని, చట్టపరమైన చర్యలకు వెళ్తున్నట్టు చెప్పింది.
ఇలాంటి వాళ్ళు మంత్రులైనా ఆర్టిస్టులైనా ఎవరైనా సరే తీవ్రమైన శిక్ష పడితే తప్ప ఈ ప్రహసనం ఆగేలా లేదు. కేవలం కాంట్రావర్సి ద్వారా పాపులర్ అయ్యేందుకు వేస్తున్న ఎత్తుగడల్లో ఇది భాగంగా కనిపిస్తోంది. సదరు ఏవి రాజు గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడట. అయినా బుద్ది రాకపోవడం విచారకరం. అయినా పదే పదే త్రిషని లక్ష్యంగా పెట్టుకోవడం పట్ల అభిమానులు కలత చెందుతున్నారు. కెరీర్ చక్కగా ఉన్న టైంలో ఇలా రాళ్లు ఎందుకు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సిగ్గు మానం లేని రాజు లాంటి వ్యక్తులు అవన్నీ ఆలోచిస్తారా.
This post was last modified on February 20, 2024 10:43 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…