వారంతా వైద్య విద్యార్థులు. పట్టాలు పుచ్చుకుని రేపు సమాజానికి సేవ చేయాల్సిన బృహత్తర బాధ్యత ఉన్న భావి డాక్టర్లు. కానీ, విచక్షణ మరిచి.. పక్కా రోడ్ సైడ్ రోమియోల మాదిరిగా వ్యవహరించారు. చిన్న చితకా కాలేజీల్లో పోకిరీల మాదిరిగా వ్యవహరించారు. జూనియర్లకు గుండు కొట్టి.. సీనియర్లు చిందులు తొక్కారు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణలో చర్చగా మారింది.
తెలంగాణలోని రామగుండం ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి వైద్య కాలేజీలో సీనియర్లు దారుణానికి తెగబడ్డారు. తమ జూనియర్లకు దిశానిర్దేశం చేసి.. ఉన్నతంగా చదువుకునేలా వ్యవహరించాల్సిన వారు.. సోమవారం అర్ధరాత్రి.. గుట్టు చప్పుడు కాకుండా.. సీనియర్లు ఉన్న గదుల్లోకి చొరబడ్డారు. ఆ విద్యార్థులు వారిస్తున్నా.. చేతులు, కాళ్లు కట్టేసి మరీ.. వారి జుట్టు తీసేసి, మీసాలు తొలిగించి పైశాచిక ఆనందం పొందారు. దీంతో ఒక్కసారిగా భీతిల్లిన జూనియర్ విద్యార్థులు తెల్లవారక ముందే.. పెట్టె బేడా సర్దుకుని తమ ఇళ్లకు వెల్లిపోయారు.
అయితే.. జూనియర్లపై సీనియర్ల ఆగడాలు తెలుసుకున్న వారి తల్లిదండ్రులు.. నేరుగా కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు.. ఆయన చాంబర్ ముందే ఆందోళనకు దిగారు. మొత్తం ఇద్దరు విద్యార్థులను సీనియర్లు ఘోరంగా అవమానించారని తెలుసుకున్న ప్రిన్సిపాల్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు.. వారిపై వైద్య మండలికి సైతం ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విషయం తెలిసిన గోదావరిఖని పోలీసులు ర్యాగింగ్ ఘటనపై జూనియర్లను విచారించారు.
This post was last modified on February 14, 2024 2:18 pm
తెలంగాణ మంత్రి ధరసరి సీతక్క.. ఫైర్.. ఫైర్‌బ్రాండ్! కొన్ని కొన్ని విషయాల్లో ఆమె చేసిన, చేస్తున్న కామెంట్లు కూడా ఆలోచింపజేస్తున్నాయి.…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్షేత్రస్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయన…
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…