అది చాలా చిన్నదేశం. పైగా.. కోటి మందికంటే కూడా తక్కువ మందే జనాభా ఉన్నారు. కానీ, చూసేందు కు, జనాభా పరంగా కూడా చిన్నదేఅయినా.. ఈ దేశం ఇప్పుడు ప్రపంచ స్తాయిలో చర్చకు వచ్చింది. ప్రజాస్వామ్య దేశాలకు.. ముఖ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్న అమెరికా, భారత్ వంటి వాటికి అది ఆదర్శంగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. అదే… యూరోపియన్ యూనియన్‌లో ఉన్న హంగేరీ దేశం. దీని జనాభా తాజా లెక్కల ప్రకారం.. 98 లక్షల లోపే.
ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు ఆదర్శమైందనే ప్రశ్నలు చూస్తే.. ప్రస్తుతం ఈ దేశానికి అధ్యక్షురాలిగా ఉన్న కేటిలిన్ నోవక్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా ప్రజాస్వామ్య దేశమే. కానీ, చాలా చిన్న దేశం. అయితే.. ఆమె రాజీనామాకు కారణం.. ఆమె పార్టీ బలహీనంగా ఉండడం కాదు.. తిరుగుబాటు అసలే కాదు. నిజానికి ఆమెను కోరుకునేవారే.. ఎక్కువ మంది ఉన్నారు. ఆమె మాట వేదంగా పాలక పార్టీ భావిస్తుంది. అలాంటిది ఆమె(38 సంవత్సరాలు) రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
పాలక పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ప్రజలకు ఎన్నో మేళ్లు చేశారు. కరోనా సమయంలో ప్రజలను ఆదు కున్న తీరు ఆమెను రెండోసారి ఇక్కడ పగ్గాలు చేపట్టేలా చేసింది. ఇక, పేదరికాన్ని తగ్గించే చర్యలతో ఐక్య రాజ్యసమితి ప్రశంసలు కూడా అందుకున్నారు. ప్రచారానికి, ప్రలోభాలకు కడుదూరంగా ఉంటారు. అలాంటి ది ఆమె ఒకే ఒక్క నిర్ణయం కారణంగా.. రాజీనామా చేశారు. అది కూడా.. ప్రజల అభిమతానికి అనుగుణంగానే. అంటే.. చిన్నదేశమే అయినా.. ప్రజల ఇష్టాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుస్తుంది.
ఇదీ.. కారణం!
దేశంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించారు. అయితే.. ఆయన తనకు ప్రాణ భిక్ష ప్రసాదించమంటూ.. అధ్యక్షురాలిగా ఉన్న కేటిలిన్‌కు విన్నవించుకున్నారు. దీనిని పరిశీలించిన ఆమె.. అతని శిక్షను రద్దు చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు. అయితే.. జైల్లో ఉంచాలని మాత్రం ఆదేశించారు. కానీ, ఉరి శిక్షను రద్దు చేయడంపై ప్రజలలో ఆగ్రహం పెల్లుబికింది. అంతే.. వీధుల్లోకి వచ్చి.. రెండు రోజులుగా నిరసన చేశారు. దీనిని ఇబ్బందిగా భావించిన.. కేటిలిన్.. తన పదవికి రాజీనామా చేశారు. చిత్రంగా అనిపించినా.. ఇంత చిన్న కారణానికే ఆమె రాజీనామా చేయాలా? అని అనిపించినా.. ఇది నిజం.
చివరి పలుకులు..
రాజీనామా చేయడానికి ముందు.. కేటిలిన్.. దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్య దేశాలకు మణిమకుటంగా నిలిచాయి. అశేష ప్రజానీకం ఆశీస్సులతో నేను ఈ పదవిని పొందాను. వారి అభీష్టాలకు వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకున్నానని.. ముందు భావించలేదు. ఒక వ్యక్తికి ప్రాణ భిక్ష పెడుతున్నానని అనుకున్నాను. ఇది నా మనసుకు నచ్చింది. మనసు వేరు.. ప్రజాభిప్రాయం వేరు. ప్రజలే దేవుళ్లు. వారి నిరసన ముదావహం. స్వాగతిస్తున్నా. నేను ఈ పదవికి అనర్హురాలిని. నన్ను క్షమించండి!
అని పేర్కొని లైవ్ లోనే.. తన రాజీనామాను ప్రజలకు చూపించారు.
ఇదీ.. ఆదర్శం..
ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు.. అని లిఖించే ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభీష్టాలకు .. వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని.. ఇటీవల బీబీసీ వెలువరించిన గోద్రా దుర్ఘటనల ఎపిసోడ్‌లో మేధావులు అబిప్రాయపడ్డారు.(అందుకే..దీనిని మన దగ్గర బ్యాన్ చేశారనే వాదన ఉంది) రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేసినా.. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని క్రీడాకారులు.. దుమ్మెత్తి పోసినా.. మన దగ్గర(అతి పెద్ద ప్రజాస్వామ్యం) ఎంత విలువ ఇస్తున్నారో తెలిసిందే కదా! దీనిని బట్టి హంగేరీ ఆదర్శం కాదంటారా!!