శీర్షిక చూడగానే ఆశ్చర్యం వేసిందా? విస్మయం కలిగిందా? ఔను.. నిజమే. మనం కంటితో చూస్తున్న ప్రతి దశ్యం వెనుక అనేక కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అలానే.. ఈ నెల 22న చూడముచ్చటైన రూపంలో అయో ధ్యలో కొలువు దీరిన బాలరామయ్య విగ్రహం వెనుక కూడా.. పెద్ద వ్యథే గూడుకట్టుకుంది. రాతిని మలిచి.. రామయ్యగా కొలువుదీర్చిన ఈ ప్రధాన ఘట్టంలో తెరవెనుక మరుగుపడిన ఓ హృదయ విదారక అంశం తాజాగా వెలుగు చూసింది. ఈ శిల.. అయోధ్యకు చేరడం వెను.. ఓ గృహిణి తాళి బొట్టు తాకట్టు వ్యధ దాగి ఉంది.
భద్రాచల రామదాసు మాదిరిగా.. ఇక్కడ కూడా.. శ్రీనివాస్ అనే ఒక కాంట్రాక్టర్ తనకు ఆ రామయ్యే దిక్కం టూ కుమిలిపోతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న అయోధ్య రామయ్య నినాదం ఎంత మార్మో గుతోందో.. తాజాగా ఈ విషయం కూడా అంతే స్థాయిలో వెలుగులోకి వచ్చింది. దీనిపై రామజన్మభూమి తీర్థ ట్రస్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఏం జరిగింది?
రామజన్మభూమిలో రామమందిర నిర్మాణంపై చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి. వీటితో సంబంధం లేకుండా.. మరోవైపు.. కర్ణాటకలో ఒక యాదృచ్ఛిక ఘట్టం చోటు చేసుకుంది. మైసూర్ జిల్లా, హెచ్‌డీ కోట తాలూక.. బుజ్జేగౌడనపురలోని ఓ పొలంలో రైతులుపంట కోసం యథాలాపంగా దుక్కిదున్నారు. ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ సాగుచేస్తున్నారు. కానీ, వింతో విచిత్రమో తెలియదు కానీ.. పొలంలో నాగలికి.. పెద్ద బండరాయి తగిలింది. దీంతో పనులు ఆపేసి.. రాళ్ల విక్రయ దారుగా.. కాంట్రాక్టరుగా ఉన్న శ్రీనివాస్‌ను సంప్రదించారు. దీంతో ఆయన వెళ్లి పరిశీలించి దీనిని బయటకు తీశారు. ఈ క్రమంలో ఆయన రైతు నుంచి కొంత సొమ్ము తీసుకున్నారు.
కట్ చేస్తే.. పొలం నుంచి తీసిన ఈ భారీ కృష్ణ శిల వ్యవహారం.. కర్ణాటక సర్కారుకు తెలిసింది. అప్పట్లో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. వెంటనే గనుల శాఖ అధికారులు వచ్చి.. ఎలాంటి అనుమతి లేకుండానే భారీ శిలను భూమి నుంచి సేకరించిన నేరంపై 80 వే లజరిమానా విధించారు. దీనిని కట్టకపోతే.. జైలు తప్పదని హెచ్చరించారు. దీంతో విధిలేక కాంట్రాక్టర్ శ్రీనివాస్.. తన భార్య మెడలో తాళిని తాకట్టుపెట్టి 50 వేలు.. తన దగ్గర ఉన్న 30 వేలు కలిపి జరిమానా చెల్లించారు.
ఇలా ఆ కేసు నుంచి బయట పడిన శ్రీనివాస్.. తన కార్యశాలకు.. ఆ శిలను చేర్చారు. నెలలు గడిచిపోయి నా.. దానిని ఎవరూ కొనలేదు. ఇంతలో అయోధ్య రామ తీర్థ ట్రస్టు నుంచి వచ్చిన సభ్యులు శిలను పరిశీలించి.. తీసుకువెళ్లారట. ఆ శిలే.. ఇప్పుడు అయోధ్య రామాలయంలో బాలరామునిగా విరాజిల్లు తోంది. అయితే.. తాళిబొట్టు విషయానికి వస్తే.. ఇప్పటికీ అది తాకట్టులోనే ఉందని శ్రీనివాస్ చెప్పారు. తన నుంచి సేకరించిన శిల.. రాముడిగా మారుతుందని ఊహించలేదని ఆయన అన్నారు. త్వరలోనే తాను తీర్థ ట్రస్టును కలిసి.. తన సమస్యను వెల్లడించి సాయం కోరతానని చెప్పడం గమనార్హం.
This post was last modified on January 28, 2024 9:44 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…