విమానాలు ప్రయాణించే రన్‌వేపై కాకిని సైతం వాలనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నిత్యం ఎంతో అప్రమత్తంగా ఉంటూ.. రన్‌వేలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. అత్యంత వేగంగా దూసుకువచ్చే విమానాలకు చిన్న పాటి ఇబ్బంది కూడా లేకుండా.. కడిగిన ముత్యంలా రన్‌వేలను పర్యవేక్షిస్తారు. అలాంటి రన్ వే పై ఏకంగా.. రాత్రి వేళ భోజనాలు ఏర్పాటు చేస్తే.. ఒకరు కాదు ఇద్దరుకాదు.. ఏకంగా 150 మంది ప్రయాణికులను రన్‌వే పైనే కూర్చోబెట్టి వండి వారిస్తే.. ఊహించేందుకు కూడా ఆశ్చర్యం వేస్తుంది కదూ!
కానీ.. అచ్చం ఇలానే జరిగింది. రన్‌వే పై ప్రయాణికులను కూర్చోబెట్టి వారికి వండి వార్చి వడ్డించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ పని చేసింది.. వ్యక్తులు కాదు.. ఏకంగా ఇండిగో సంస్థే. అంతే.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ.. మండిపడింది. ఇండిగో సంస్థకు ఏకంగా కోటీ 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇక ఇదే ఘటనపై ముంబై ఎయిర్ పోర్టుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏకంగా 30 లక్షలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రూ.60 లక్షలు చొప్పున జరిమానాలు విధించాయి.
అసలేం జరిగింది?
కనీసం.. పిట్ట కూడా వాలేందుకు అనుమతి లేని రన్‌వేపై ఏకంగా 150మందికి భోజనాలు వడ్డించడం వెనుక ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పొగమంచు.. వాతావరణంలో ఏర్పడిన అసమతుల్య పరిస్థితుల కారణంగా.. విమానాలు ఆలస్యం అవుతున్నాయి. మరికొన్నింటిని రద్దు కూడా చేస్తున్నారు. దీంతో .. ప్రయాణికులు ఆయా సంస్థలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం 12 గంటలు ఆలస్యంగా బయలు దేరింది.
ఇది పైలెట్‌పై దాడికి కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. ఇండిగో సంస్థ.. ఇలా ముంబై విమానాశ్రయంలో ఈ నెల 15న డిన్నర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూడడంతో చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. విమానాల రాకపోకల అంశం.. అటుకేంద్రంలోని బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు మధ్య రాజకీయ వివాదాన్ని కూడా సృష్టించిన విషయం తెలిసిందే.
This post was last modified on January 18, 2024 11:22 am
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…