Trends

ఒకే ఒక్క‌డు.. 9 వేల కండోమ్‌లు

ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు..అనే మాట ఆ వ్య‌క్తికి అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతుంది. ఎందుకంటే… `అంత పోటుగాడు` మ‌రి అంటున్నా నెటిజ‌న్లు. ఈ ఏడాదిలో అత‌గాడు..ఏకంగా 9940 కండోమ్‌ల‌ను వాడేశాట‌. దీంతో అత‌ని య‌వ్వార్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ఈ విష‌యం తెలిసిన వారు.. `ఎంత‌టి ర‌సికుడ‌వో.. తెలిసెరా!` అంటూ కూనిరాగాలు తీస్తున్నారు. ఇంత హాట్ ఘైని ఎక్క‌డా చూసి ఉండ‌రని కూడా నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. 2023వ  సంవ‌త్స‌రం ముగిసిపోతున్న నేప‌థ్యంలో ఆన్‌లైన్ మ‌ర్చంట్ కు సంబంధించి ప‌లు వ్యాపార సంస్థ‌లు తాము చేసిన లావాదేవీల‌ను వెల్ల‌డిస్తున్నారు. స్విగ్గీ, బుక్‌మై షో, అమెజాన్ ఇలా.. అనే సంస్థ‌లు ఈ ఏడాదిలో ఎన్ని ఆర్డ‌ర్లు చేశారు. వీటిలో ఆస‌క్తిక‌ర‌మైన ఆర్డ‌ర్లు ఎన్ని అనే లెక్క‌లు చెప్పి.. అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌ముఖ ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థ `స్టోర్ బ్లింకిట్‌` ఈ ఏడాది తాను చేసిన లావాదేవీలు.. వ‌చ్చిన ఆర్డ‌ర్లు, చేసిన డెలివ‌రీల వివ‌రాలు వెల్ల‌డించింది.

ఈ సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు.. ఢిల్లీలోని ద‌క్షిణ ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి ఏకంగా.. 9,940 కండోమ్స్ ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసి తెప్పించుకున్నాడు. దీంతో ఈ వార్త సంచ‌ల‌నంగా మారింది. స‌హ‌జంగా.. కండోమ్స్ అంటే శృంగారానికి సంబంధించిన‌వి కావ‌డంతో గోప్యంగా కొనుగోలు చేస్తారు. లేదా కొనుగోలు చేసినా ప‌దులు, లేదా వంద‌ల్లో ఉంటాయి. ఇలా ఒకే ఏడాదిలో 9వేల 940 కండోమ్‌ల‌ను కొనుగోలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిపైనే నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. ఎంత‌టి ర‌సికుడ‌వో తెలిసెరా.. అంటూ ఆట‌ప‌ట్టిస్తున్నారు. మ‌రి కొంద‌రు.. `మంచి పోటుగాడే` అంటూ..బుగ్గ‌లు నొక్క‌కుంటున్నారు. ఇదీ.. సంగ‌తి!

This post was last modified on December 31, 2023 1:21 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago