రెండు రోజుల కిందట ఒక షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్. తమ జట్టుకు 5 టైటిల్లు అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినప్పుడే.. భవిష్యత్తులో అతనికి జుట్టు పగ్గాలు అప్పగిస్తారని అంచనా ఏర్పడింది. కానీ ఈ సీజన్ నుంచే రోహిత్ ని పక్కన పెట్టి హార్దిక్ ను సారథిని చేస్తారని ఎవరు ఊహించలేదు.
రోహిత్ తో మాట్లాడి పరస్పరంగీకారంతోనే ముంబై ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుకున్నారు. కానీ రోహిత్ అయిష్టంగానే గానే కెప్టెన్సీకి దూరమయ్యాడన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ముంబై ఇండియన్స్ నిర్ణయం ఆ జట్టు అభిమానులకు ఎంత మాత్రం రుచించడం లేదు. కెప్టెన్సీ మార్పుపై అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందన్నది ఊహించిన విషయమే.
కానీ ఎవరు ఊహించిన విధంగా అభిమానులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం బయటికి వచ్చి మూడు రోజులైనా వారి ఆగ్రహం చల్లారడం లేదు. సోషల్ మీడియా అకౌంట్లో ముంబై ఇండియన్స్ ను లక్షల మంది అన్ ఫాలో చేస్తున్నారు. చేస్తూనే ఉన్నారు. మూడు రోజులుగా ముంబైకి వ్యతిరేకంగా నెగిటివ్ ట్రెండ్స్ ఉన్నాయి. కెప్టెన్సీ ఇస్తానంటేనే ముంబైకి వస్తానంటూ హార్దిక్ పాండ్య కండిషన్ పెట్టాడని.. అందుకు అంగీకరించిన ముంబై యాజమాన్యం రోహిత్ ని అవమానకర రీతిలో తప్పించిందని.. మిగతా జట్టు సభ్యులను కూడా ఈ విషయంలో సంప్రదించలేదని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
సూర్య కుమార్ యాదవ్, బుమ్రా లాంటి వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు చూస్తే వారికి కూడా ఏమాత్రం రుచించడం లేదని అర్థమవుతుంది. ఈ పరిణామాలు రోహిత్ అభిమానుల ఆగ్రహాన్ని ఇంకా పెంచాయి. ఎన్నో ఏళ్లుగా ముంబై ఫ్రాంచైజీని నెత్తిన పెట్టుకున్న అభిమానులు ఇప్పుడు ఒక్కసారిగా పక్కన పడేస్తున్నారు. కెప్టెన్సీ మార్పు నిర్ణయం ఈ స్థాయిలో తమ జట్టుపై వ్యతిరేకత తీసుకొస్తుందని ముంబై కూడా ఉండకపోవచ్చు. ఇది ఆ జట్టు ఫాలోయింగ్, విలువను బాగానే దెబ్బతీసేలా కనిపిస్తోంది.
This post was last modified on December 17, 2023 7:00 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…