ఎంత విలాసవంతమైనప్పటికీ.. ఒక పెంట్ హౌస్ ధర ఎంత ఉంటుంది? హెడ్డింగ్ ను పట్టించుకోకుండా మీ మనసులో ఎంత లెక్కేసుకున్నా.. రూ.1113 కోట్ల మొత్తాన్ని మాత్రం ఊహించటం మాత్రం అసాధ్యం. అలాంటి రికార్డు ధరను సొంతం చేసుకుంది దుబాయ్ లోని ఒక విలాసవంతమైన ఒక పెంట్ హౌస్. దుబాయ్ లోని అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో నిర్మిస్తున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఒక పెంట్ హౌస్ ను నిర్మిస్తున్నారు.దీని విలువ ఏకంగా రూ.1113 కోట్లు కావటం సంచలనంగా మారింది.
పేరు బయటకు వెల్లడి చేసేందుకు ఇష్టపడని ఒక అపరకుబేరుడు ఈ పెంట్ హౌస్ ను సొంతం చేసుకున్నాడు. ఐదు పడకల పెంట్ హౌస్ విస్తీరన్ణం 22 వేల చదరపు అడుగులుగా చెబుతున్నారు. ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్ గా ఇది రికార్డును క్రియేట్ చేస్తోంది. ఇంతకూ ఈ ఇంటి ప్రత్యేకతలు ఏమిటి? అన్న ప్రశ్నను వేస్తే..నాన్ స్టాప్ గా దీనికున్న గొప్పల్ని చెప్పుకొస్తారు.
360 డిగ్రీల స్కైపూల్ ఉండటంతో పాటు.. దీన్ని ఇంట్లో అత్యంత కీలకమైన వ్యూహాత్మక చోటులో నిర్మిస్తారు. ఈ పెంట్ హౌస్ పైనుంచి చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా.. ఆ కోవకు చెందిన బుర్గ్ అల్ అరబ్.. దుబాయ్ మరీనాలాంటి అత్యంత ఎత్తైన నిర్మాణాలెన్నో కనువిందు చేసే వ్యూ ఉంటుంది. ఈ టవర్ ఎత్తు 984 అడుగులకు పైనే. ఈ అపార్ట్ మెంట్ లో ఒక్కో ఫ్లోర్ లో కేవలం ఒకట్రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ కోమో టవర్ మరో నాలుగేళ్లకు అందుబాటులోకి రానుంది. 2027లో దీని నిర్మాణం పూర్తి కానున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసి.. పెంట్ హౌస్ ను సొంతం చేసుకున్న సంపన్నుడి వివరాల్ని బయటకు రానివ్వలేదు. అయితే.. ఈ కుబేరుడు తూర్పు యూరప్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు.
రియాల్టీకి స్వర్గధామంగా చెప్పే దుబాయ్ లో అపార్ట్ మెంట్లు.. ప్లాట్లు.. విల్లాలు.. పెంట్ హౌస్ లు భారీ మొత్తాలకు అమ్ముడుపోవటం ఈ మధ్యన ఎక్కువైంది. కొద్ది నెలల క్రితం మర్సా అల్ అరబ్ హోటల్ పెంట్ హౌస్ రూ.956 కోట్లకు అమ్ముడై హాట్ టాపిక్ గా మారితే.. తాజాగా దానికి మించి మరీ ధర పలకటం గమనార్హం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ గా మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్ నిలిచింది. దీని ధర రూ.3670కోట్లు. ఆ తర్వాత రికార్డు లండన్ లోని వన్ హైడ్ పార్క్ పెంట్ హౌస్ గా చెబుతారు. దీని ధర రూ.1975 కోట్లు. తాజాగా మూడో స్థానంలో దుబాయ్ పెంట్ హౌస్ నిలిచింది.
This post was last modified on December 7, 2023 10:38 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…