పాశ్చాత్య దేశాల నుంచి సరోగసి సంస్కృతి మనదేశంలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సంతానం లేని దంపతులకు చట్ట ప్రకారం కొన్ని నిబంధనలతో సరోగసికి అనుమతి ఉంది. అయితే, కొందరు నిబంధనలను ఉల్లంఘించి అద్దె గర్భాన్ని అమ్ముకుంటున్న వైనంపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం పొందాలనుకుంటున్న దంపతులను టార్గెట్ చేస్తూ కొత్త ధందా మొదలైంది. సంతానం లేని దంపతులకు మైనర్ బాలికల అండాలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది.
పేద కుటుంబాలకు చెందిన బాలికలకు డబ్బులు ఎరవేసి ఈ చర్యలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఐవీఎఫ్ సెంటర్లకు వచ్చే జంటలను ఈ ముఠా టార్గెట్ చేసింది. 15-17 ఏళ్ల వయసున్న మైనర్ బాలికల అండాలను వారికి విక్రయిస్తోంది. డబ్బులు అవసరం ఉన్న పేదింటి బాలికలను టార్గెట్ చేసుకొని వారి వయసుకు సంబంధించిన నకిలీ పత్రాలను ఈ ముఠా సృష్టిస్తోంది . ఒక మైనర్ బాలిక నుంచి అండాలు సేకరించి 30 వేలు ఇస్తామని ఆశ చూపి 11,500 చెల్లించడంతో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో, ఆ ముఠా గుట్టు రట్టయింది.
ఈ క్రమంలోనే ఆ ఘటనపై దర్యాప్తు జరిపిన వారణాసి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఐవీఎఫ్ ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లకు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం అండం దానం చేసే మహిళ వయస్సు 23 ఏళ్లు దాటాలి. అంతేకాదు, ఆమెకు వివాహమై మూడేళ్ల వయసు దాటిన బిడ్డ ఉండాలి. ఇక, ఒక మహిళ జీవితంలో ఒకసారి మాత్రమే అండదానం చేసేందుకు అర్హురాలు.
This post was last modified on November 18, 2023 12:41 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…