Trends

ఆ రైలు ప్రమాదం ఎలా జరిగింది?

ఒక ట్రాక్ మీద ఒక రైలు ఉన్న వేళ.. అదే ట్రాక్ మీదకు మరో రైలు వస్తుందా? ఆ అవకాశం ఉంటుందా? అంటే ‘నో’ అనేస్తారు. కానీ.. కొన్ని నెలల క్రితం బాలేశ్వర్ ఘోర రైలు ప్రమాదం ఉదంతాన్ని మరవక ముందే.. అదే తరహాలో ఏపీలోని విజయనగరం జిల్లాలో అలాంటి ఉదంతమే ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సిగ్నలింగ్ పాపానికి యాభై మంది (?) వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంచనా వేస్తున్నారు. వీరిలో పద్నాలుగు మ్రతదేహాల్ని అర్థరాత్రి నాటికి బయటకు తీయగా.. మిగిలిన వారిని తీయాల్సి ఉంది. మరణించిన వారి సంఖ్యపై సందేహాలు ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో వందకు పైగా ప్రయాణికులు గాయాలబారిన పడ్డారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం రైలు ప్రయాణ భద్రతపై కొత్త సందేహాల్ని తీసుకొచ్చేలా చేసింది.

ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి -అలమండ మధ్య ట్రాక్ మీద ఉన్న గూడ్సు రైలును విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖ -పలాస (08532) రైలు వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో బయలుదేరిన విశాఖపట్నం – రాయగడ (08504) రైలు ఢీ కొట్టింది. ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీ కొనటంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా.. మరికొన్ని పట్టాలు తప్పాయి. అక్కడే మరో ట్రాక్ మీద ఉన్న గూడ్సు రైలు బోగీలపైకి దూసుకెళ్లాయి.

ఈ ఘోర ప్రమాదం జరిగింది రాత్రి వేళ కావటంతో అక్కడ భీతావహ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చీకటి వాతావరణం కావటంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కంటకాపల్లి- అలమండ వద్ద సిగ్నల్ కోసం పలాస ప్యాసింజర్ పట్టాల మీదకు నెమ్మదిగా వెళుతూ ట్రాక్ మీద నిలిచింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీ కొట్టింది. పలాస ట్రైన్ గార్డు ఉన్న బోగీ రాయగడ ఇంజిన్ ను ఢీ కొనటంతో ఆ రెండు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాద వేగానికి రాయగడ బోగీలు అదే రైలు ఇంజిన్ మీదకు దదూసుకెళ్లాయి. ఆ సమయంలో పక్క ట్రాక్ మీద గూడ్స్ రైలు వెళుతోంది. దీంతో.. కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీ కొన్నాయి.
మొత్తం రెండు ప్యాసింజర్ రైళ్లు.. గూడ్సు రైలుతో సహా ఏడు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఒకవేళ.. పక్క ట్రాక్ మీద కూడా ప్రయాణికులు ప్రయాణించే రైలు ఉన్నట్లైయితే.. ప్రాణనష్టం మరింత తీవ్రంగా ఉండేది. ఈ ప్రమాదాన్ని చూసినోళ్లు.. నోరెళ్లబెట్టే పరిస్థితి. ఎందుకంటే.. వెనుక నుంచి ఢీ కొట్టిన రాయగడ రైలు ఇంజిను పైకి ఆ రైలుకు చెందిన మూడు బోగీలు పైకెక్కేశాయి. పక్కనే ఉన్న గూడ్సు రైలును ఢీ కొన్నాయి. అదే సమయంలో విశాఖ -రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి పడింది. దాని వెనుక ఉన్న డీ1 బోడీ వేగానికి కొంత భాగం పైకి లేచింది. ఇలా బోగీలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో.. సహాయక చర్యలకు సవాలుగా మారింది.

రెండు ప్యాసింజర్ రైళ్లలో 1400 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా ఒక అంచనా. ఈ ఘోర రైలు ప్రమాదంలో గార్డు బోగీలో ఉన్న రైలు ఉద్యోగితో పాటు.. రాయగడ రైలు ఇంజిన్ లో ఉన్న ఇద్దరు లోకో పైలెట్లు మరణించినట్లుగా చెబుతున్నారు. సిగ్నలింగ్ తప్పిదమా? మానవ తప్పిదమా? అన్న దానిపై వాదనలు జరుగుతున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవ తప్పిదం చాలా తక్కువని.. సిగ్నలింగ్ ఇష్యూనే ప్రమాదానికి కారణమై ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ప్రమాదం జరిగిన రైల్లో ప్రయాణించే ఒక రైల్వే ఉద్యోగి మాట్లాడుతూ.. తన 26 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ప్రమాదాన్ని చూడలేదని చెప్పారు. “ఒకే ట్రాక్ లో సిగ్నల్ క్రాస్ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారన్నది అంతుబట్టటం లేదు” అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on October 30, 2023 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…

22 mins ago

రాజాసింగ్…క‌న‌బ‌డుట‌లేదు!

రాజాసింగ్‌... రాజ‌కీయాల ప‌ట్ల క‌నీస ప‌రిచ‌యం ఉన్న‌వారికి ఎవ‌రికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి  కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు.…

1 hour ago

ఎంపీ అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు?

వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…

4 hours ago

నయన్‌పై ధనుష్ ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్

ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…

4 hours ago

డాన్‌లీ ఉన్నాడా లేడా? – సందీప్ ఏమన్నాడంటే..

ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…

10 hours ago