సినిమా వాళ్లు ఒకప్పట్లా స్వేచ్ఛగా రాజకీయాలు మాట్లాడే రోజులు ఇప్పుడు లేవు. ఎవరికో ఒకరికి మద్దతు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా తయారవుతోంది పరిస్థితి. ఒక పార్టీకి మద్దతుదా చిన్న మాట మాట్లాడినా.. ఇంకో పార్టీ వాళ్లు తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. పార్టీల సంగతి పక్కన పెట్టి ఏదైనా సమస్య మీద మాట్లాడినా.. అధికారంలో ఉన్న పార్టీ వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అందుకే చాలా వరకు ఫిలిం సెలబ్రెటీలు సైలెంటుగా ఉండిపోతున్నారు.
ఇలాంటి టైంలో శ్రీకాంత్ అయ్యంగార్ అనే నటుడు చాలా అగ్రెసివ్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఢీకొడుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. శ్రీకాంత్ కొన్ని నెలల కిందట ఆంధ్రాలో తయారయ్యే బూమ్ బూమ్ బీర్ మీద ఒక సెటైరికల్ వీడియో చేశాడు. రాకేష్ మాస్టర్ ఈ బీర్ తాగాక తనకేదో తేడాగా ఉందని వీడియో పెట్టడం.. తర్వాత కొన్ని రోజులకే ఆయన చనిపోవడం తెలిసిందే.
దీంతో రాకేష్ మాస్టర్ ఆంధ్రా మందు తాగి ప్రమాదం కొని తెచ్చుకున్నాడనే చర్చ సోషల్ మీడియాలో నడిచింది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ తాను బూమ్ బూమ్ బీర్ తాగుతుున్నానని.. ఏమవుతుందో తెలియదని సెటైరికల్ వీడియో చేశాడు. అది వైసీపీ వాళ్లకు రుచించలేదు. ఆయన్ని తీవ్ర స్థాయిలో బూతులు తిట్టారు. ఐతే తాను వైసీపీ, జగన్, ప్రభుత్వం ఇలా ఎవరి మాటా ఎత్తకుండా వీడియో చేస్తే.. ఇంత దారుణంగా తిడతారా అంటూ శ్రీకాంత్ రివర్స్ అయ్యాడు. గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు తడుముకున్న చందంగా ఇది ఉందంటూ వైసీపీ మద్దతుదారులను టార్గెట్ చేస్తూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలు మాట్లాడకున్నా, ఎవరికి మద్దతుగానో, వ్యతిరేకంగానో మాట్లాడకపోయినా తనను టార్గెట్ చేసి దారుణమైన బూతులు తిట్టారని.. వీళ్లను అంత సులువుగా వదిలిపెట్టనని అన్నాడు. తనకు ఫ్యామిలీ లేదని, ఏక్ నిరంజన్ అని.. తనను అమ్మనా బూతులు తిట్టిన వాళ్లు ఏం చేస్తారో చూస్తానని.. వాళ్లతో తాడో పేడో తేల్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.
This post was last modified on October 22, 2023 5:48 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…