ప్రస్తుతం క్రికెట్ ప్రియులను ఉత్కంఠకు గురిచేస్తున్న ఐసీసీ ప్రపంచకప్‌లో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్-భారత్ జట్ల మధ్య గురువారం క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బంగ్లా దేశ్ క్రీడాకారులకు పాకిస్థాన్ సినీ హీరోయిన్ సెహర్ షిన్వారీ సంచలన ఆఫర్ ఇచ్చింది. బంగ్లాదేశ్ క్రీడాకారులకు నా విన్నపం. భారత జట్టును చిత్తుగా ఓడించండి. మీతో డేటింగ్‌కు వస్తా
అంటూ సెహర్ షిన్వారీ సంచలన ప్రకటన చేసింది.
ఎందుకింత ఉడుకు?
ఐసీసీ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు జోరు మీదుంది. ఇప్పటి వరకు జరిగిన ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్‌ల మ్యాచ్‌లలో వరుస గెలుపు సాధించి.. అలుపులేని విజయాలు కైవసం చేసుకుంది. అయితే.. వీటిలో ముఖ్యంగా పాకిస్థాన్ జట్టును భారత్ ఓడించడం.. పైగా.. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టుముందు జై శ్రీరాం నినాదాలు చేయడం వంటివి సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టుపై అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు భారత్‌ను ఓడించకపోయినా.. గురువారం జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అయినా.. భారత్‌ను ఓడించాలని పాకిస్థానీ క్రికెట్ ప్రియులు కోరుకుంటున్నారు.
దీంతో బంగ్లాదేశ్‌పై భారత్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి బంగ్లాదేశ్ టీమ్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గురువారం జరిగే మ్యాచ్‌లో టీమ్ ఇండియాను బంగ్లాదేశ్ ఓడిస్తే.. ఆ దేశ ఆటగాళ్లతో డేటింగ్‌కు వెళ్తానని సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘దేవుడా.. టీమ్‌ఇండియాను బంగ్లాదేశ్ ఓడిస్తే ఢాకాకు వెళ్లి ఆ దేశ క్రికెటర్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్తా’ అని సెహర్ షిన్వారి తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ జోరుగా వైరల్ అవుతోంది. మరి బంగ్లా దేశ్ భారత్‌ను ఓడిస్తుందా? షిన్వారీ కోరిక తీరుతుందా? అనేది గురువారం చూడాలి.
This post was last modified on October 18, 2023 10:41 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…