మలేషియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ పై నెటిజన్లు నిప్పులు చెరుగుతు న్నారు. ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇలా వ్యవహరిస్తారా? అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. తమ సంస్థలో పనితనం ఇదీ.. అంటూ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ చేసిన ప్రయత్నం. అయితే.. ఈ ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఆయనకు నిన్న మొన్నటి వరకు అభిమానులుగా ఉన్న నెటిజన్లు కూడా ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తూ..కామెంట్లు చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
తాజాగా ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తమ సంస్థ అధికారులు, ఉన్నతోద్యోగులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించా రు. ఈ సందర్భంగా సంస్థ పనితీరు, లాభనష్టాలు, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, వారికి అందుతున్న సేవలు, లాభాలు వంటివాటిని ఆయన చర్చించారు. అయితే.. ఈక్రమంలో ఆయన ఈ సమావేశాన్ని హుందాగా నిర్వహించకుండా.. చీప్‌గా చేపట్టారు. ఓ యువతితో మసాజ్ చేయించుకుంటూ.. హాఫ్ న్యూడ్‌గా ఉన్నారు. అలానే ఆయన తన ల్యాప్ టాప్ ముందు కూర్చుని ఎయిర్ ఏషియా ఉద్యోగులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు.
అంతేకాదు.. ఇదేదో ఘనకార్యం అన్నట్టుగా స్వయంగా టోనీ ఫెర్నాండెజ్ దీనికి సంబంధించిన ఫొటోలను లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. మసాజ్ చేసుకుంటూ మేనేజమెంట్ మీటింగ్‌కు ఇలా హాజరైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. పోస్ట్ చేశారు. ఎయిర్ ఏషియాలో పని సంస్కృతికి ఇది నిదర్శనం అని గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక, ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తూ.. ఇదేం పాడు బుద్ధి అని వ్యాఖ్యానించారు.
This post was last modified on October 17, 2023 9:23 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…