Trends

హర్ట్ అయిన ఇజ్రాయిల్… పాలస్తీనాపై ముప్పేట దాడి

ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం రోజురోజుకు తీవ్రమైపోతోంది. పాలస్తీనాను బేస్ గా పెట్టుకున్న హమాస్ మిలిటెంట్లు మూడురోజుల క్రింత ఒక్కసారిగా ఇజ్రాయిల్ పైన దాడులు మొదలుపెట్టారు. మొదట షాక్ తిన్న ఇజ్రాయిల్ దళాలు తర్వాత తేరుకుని ఎదురు దాడులు మొదలుపెట్టారు. ఇప్పటికే పాలస్తీనాలోని కొన్ని పట్టణాలు బాగా దెబ్బతినేశాయి. ఇక యుద్ధమంటేనే విచక్షణా రహితంగా దాడులు చేసుకోవటం. అదే పద్దతిలో ఇపుడు ఇజ్రాయేల్ జనావాసాలపైన మిస్సయిల్స్ ప్రయోగిస్తోంది. ముఖ్యంగా గాజా నగరాన్ని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నది.

కారణం ఏమిటంటే ఇజ్రాయేల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు ఇళ్ళల్లోకి జోరబడి మామూలు జనాలను చంపేస్తున్నారు. కొందరిని ఇళ్ళల్లో నుండి బయటకు ఈడ్చుకొచ్చి అందరిముందు నరికేస్తున్నారు. దానికి బదులుగా ఇజ్రాయేల్ కూడా అలాగే చేస్తోంది. ఇక్కడో ఇంకో సమస్య ఏముందంటే హమాస్ మిలిటెంట్లు పాలస్తీనాలోని చాలా నగరాలు, పట్టణాల్లో మామూలు జనాలుండే ఇళ్ళల్లోనే తలదాచుకుంటున్నారు.

ప్రత్యేకమైన స్ధావరాలుంటే ఇజ్రాయేల్ వాటిపైనే దాడులుచేయటానికి అవకాశాలుండేవి. కానీ ఇపుడు అలాంటి పరిస్ధితులు లేకపోవటంతోనే ఇజ్రాయేల్ జనావాసాలపై దాడులు చేస్తోంది. అందుబాటులోని సమాచారం ప్రకారం రెండు వైపులా సుమారు 3,4 వేల మంది చనిపోగా మరికొన్ని వేలమంది తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. హమాస్ ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయేల్ కు అమెరికా నౌకాదళంతో పాటు కమేండోలు కూడా రంగంలోకి దిగారు. కాబట్టి యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. చూడబోయే ఈసారి రెండు దేశాల్లో ఏదో ఒకటే ప్రపంచపఠంలో మిగులుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మొదట్లో ఇజ్రాయేల్లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు పౌరులను, సైన్యాన్ని దారుణంగా దెబ్బతీశారు. ఇజ్రాయేల్ సైన్యం దగ్గరున్న అత్యంతాధునిక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే తేరుకుని ఇజ్రాయేల్ ఎదురుదాడులు చేయటం మొదలయ్యే సమయానికి బాగా ఆలస్యమైపోయింది. ఈలోగానే ఇజ్రాయేల్ పెద్ద నష్టమే జరిగింది. ఆ కోపంతోనే పాలస్తీనాలోని నగరాలు ముఖ్యంగా గాజాపైన వేలాది మిస్సయిల్స్ తో విరుచుకుపడుతోంది. ఎందుకంటే హమాస్ కు గాజానే కేంద్ర బింధువు కాబట్టి. తమకున్న సమాచారంతో గాజాకి నాలుగువైపులా ఇజ్రాయేల్ సైన్యం దాడులు చేస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on October 11, 2023 10:18 am

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

2 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

5 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

5 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

7 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

9 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

10 hours ago