రోటీన్ కు భిన్నమైన ఉదంతం ఒకటి గుంటూరులో చోటు చేసుకుంది. సాధారణంగా అమ్మాయి.. తమను ప్రేమించట్లేదన్న కోపంతో ఆరాచకంగా వ్యవహరిస్తున్న కథనాల గురించి చదివే ఉంటారు. ఇప్పుడు అందుకు భిన్నమైన ఉదంతం ఒకటి గుంటూరులో చోటుచేసుకుంది. తనతో సహజీవనంలో ఉన్న యువకుడి మీద ఒక యువతి యాసిడ్ దాడికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది.
గుంటూరు నగరంలోని నల్లపాడుకు చెందిన వెంకటేశ్ ఒక వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు వాటర్ ను డబ్బాల్లో సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో రామిరెడ్డి తోటకు చెందిన రాధ అనే వివాహితతో వెంకటేశ్ కు పరిచయమైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన రాధకు భర్త లేడు. స్థానికంగా ఉంటూ ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరి పరిచయం ముందుకు వెళ్లి సహజీవనం షురూ చేశారు.
వీరిద్దరి వ్యవహారం వెంకటేశ్ తల్లిదండ్రులకు తెలిసి.. రాధను ఇంటి నుంచి బయటకు పంపేశారు. ఈ క్రమంలో వెంకటేశ్.. అతని కుటుంబ సభ్యులు తనను కొట్టి గాయపర్చినట్లుగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. తనను ఇంట్లో నుంచి గెంటేసిన వైనంపై కక్ష పెంచుకున్న రాధ.. తాజాగా మరో ముగ్గురు కుర్రాళ్లను తీసుకొని ఆటోలో వెంకటేశ్ వద్దకు వెళ్లారు.
అక్కడ వాటర్ బాటిళ్లను కిందకు దించుతున్న వెంకటేశ్ పై వెనుక నుంచి యాసిడ్ పోసింది. యాసిడ్ మంటలకు పెద్దగా కేకలు వేయటంతో స్థానికులు స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి అనంతరం తాను వచ్చిన ఆటోలో రాధ పరారైందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఉదంతంపై స్పందించిన పోలీసులు రాధతో పాటు.. ఆమెకు సహకరించిన మరో ముగ్గురి పైనా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రాధ కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on October 4, 2023 9:36 am
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…