Trends

సెక్స్ వ‌ర్క‌ర్ల సీరియ‌ల్ కిల్ల‌ర్‌… ఎంత మందిని చంపాడంటే!

అత‌ని వ‌య‌సు 34 ఏళ్లు. కానీ, ఆలోచ‌న‌లు మాత్రం మ‌రో 20ఏళ్ల ముందు ఉంటాయి. సెక్స్ అంటే అత‌నికి ఒక ఆట‌. సెక్స్ వ‌ర్క‌ర్లంటే అత‌నికి అత్యంత లోకువ. అందుకే వాళ్ల‌ని వాడుకున్నంత సేపు వాడుకుని.. అనంత‌రం చంపేయ‌డ‌మే కాదు.. వారి వ‌ద్ద ఉన్న న‌గ‌లు, వ‌స్తువులు, పోన్ల‌ను దోచుకోవ‌డంతోపాటు.. మూడో కంటికి కూడా తెలియ‌కుండా వారి మృత దేహాల‌ను త‌న ఇంటి వంట గ‌దిలోనే పాతిపెట్ట‌డం మ‌రో సంచ‌ల‌నంగా మారింది.

ఇలా.. సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను త‌న రూమ్‌కు పిలుచుకుని, వారితో ఎంజాయ్ చేసి.. అనంత‌రం వారిని అత్యంత దారుణంగా చంపేస్తున్న నేర‌స్థుడి అత్యంత ఘోర‌మైన ఈ ఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టి స్తోంది. అయితే.. ఇది మ‌న దేశంలో జ‌ర‌గ‌లేదు కానీ.. ద‌క్షిణాఫ్రికా దేశ‌మై రువాండాలో జ‌రిగింది. సెక్స్ వ‌ర్క‌ర్లను ఇంటికి పిలిపించుకుని వారిని చంపేసి, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుంటాడు.

అనంతరం ఆ మృతదేహాలను త‌న రూంలోని వంట గ‌దిలో గొయ్యి తీసి పాతిపెడతాడని పోలీసులు తెలి పారు. ఇలా వరుసగా నేరాలకు పాల్పడుతున్న ఈ సీరియల్‌ కిల్లర్‌ను రువాండా రాజధాని కిగాలీ పోలీసులు అరెస్టు చేశారు. 34 ఏళ్ల నిందితుడి ఇంట్లో జరిపిన తవ్వకాల్లో 10 మంది సెక్స్ వ‌ర్క‌ర్ల‌ మృతదేహాల అవశే షాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

అయితే అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14 వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తు న్నారు. నిందితుడు కొన్ని మృతదేహాలను యాసిడ్‌ వేసి కరిగించినట్లు పోలీసులు తెలిపారు. దేశంలోనే ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం ఇదే తొలిసార‌ని వారు తెలిపారు. ఇదిలావుంటే.. ప్ర‌పంచ వ్యాప్తంగా సెక్స్ వ‌ర్క‌ర్ల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. రువాండాలో పూట గ‌డ‌వ‌డం కోసం.. ప‌డుపు వృత్తిలోకి వ‌స్తున్న మ‌హిళ‌లు, యువ‌తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ఇటీవ‌లే ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

This post was last modified on September 8, 2023 9:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

29 minutes ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

42 minutes ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

2 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

3 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

4 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 hours ago