భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధృవం పై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఓవరాల్ గా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రపుటలలో నిలిచింది. చంద్రయాన్-3 సక్సెస్ ఇచ్చిన కిక్కుతో తాజాగా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలోనే ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్ వన్ సోలార్ మిషన్ లాంచింగ్ కార్యక్రమం విజయవంతమైంది.
ఉదయం 11.50 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా భూమి దిగువ కక్షలో ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ ను ప్రవేశపెట్టారు. నాలుగు నెలలపాటు ఈ శాటిలైట్ ప్రయాణించి భూమికి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రెజ్ పాయింట్ కు చేరనుంది. దాదాపు ఐదేళ్లపాటు సూర్యుడిపై ఈ శాటిలైట్ అధ్యయనం చేయనుంది. సౌర తుఫానులు, సూర్యుడి మాగ్నెటిక్ ఫీల్డ్, మాస్ ఎజెక్షన్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి ప్రతిరోజు భూమికి సమాచారాన్ని ఆదిత్య చేరవేయనుంది.
ఈ నేపథ్యంలోనే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. విశ్వాన్ని అన్వేషించడానికి అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని మోడీ అన్నారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి ప్రయోగాలు ఉపకరిస్తాయని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలకు కాంగ్రెస్ కూడా తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.
This post was last modified on September 2, 2023 5:48 pm
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…