చంద్రయాన్ 3 మీద ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురయ్యారు నటుడు ప్రకాశ్ రాజ్. రెండు రోజుల నుంచి ఆయనను నెటిజన్లు ఏకిపారేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ ఇంకా రెచ్చిపోతున్నారు. తన మీద వచ్చిన ట్రోలింగ్స్ కు గట్టిగా సమాధానం చెబుతున్నారు.
యావత్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రయాన్3 గురించి సినీ నటుడు, రాజకీయ నేత అయినటువంటి ప్రకాశ్ రాజ్ ట్విటర్ వేదికగా ఒక కార్టూన్ తో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో నెటిజన్లు కూడా ఆయనను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు.
ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే ఒక ఛాయ్ వాలా పిక్ పెట్టి..చంద్రయాన్ 3 పంపిన మొట్టమొదటి చిత్రం ఇదే..వావ్ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఆయనను ఒక రాజకీయ విద్వేషిగా మారారు అంటూ ఏకిపారేశారు. అంతేకాకుండా ఆ చిత్రం ప్రధాని మోడీని ఉద్దేశించి పెట్టిందని చీవాట్లు కూడా వేశారు.
తాజాగా ఆ ట్రోలింగ్స్ గురించి ప్రకాశ్ రాజ్ స్పందించారు. మరో ట్వీట్ ద్వారా వాటికి సమాధానం చెప్పారు. ‘విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుంది’ అని పేర్కొంటూ తన గత ట్వీట్‌కు వివరణ ఇచ్చారు. నేను ఓ పాత జోక్ ని గుర్తు చేస్తూ పెడితే..దానిని కూడా రాజకీయం చేస్తున్నారు అని పేర్కొన్నారు.
తాను కేరళ చాయ్‌వాలాపై పోస్టు షేర్ చేశానని, మరి ట్రోల్స్ చేసిన చాయ్‌వాలా ఎవరు? అని పరోక్షంగా మోడీని ఉద్దేశించి సెటైర్ వేశారు. జోక్‌ను అర్థం చేసుకోలేనివారు అది తమపైనే అని అనుకుంటారని ఘాటుగా బదులిచ్చారు. కాస్త ఎదగండయ్యా.. అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.
This post was last modified on August 22, 2023 5:47 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…