ఈ మధ్యకాలంలో పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వైనం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, విడాకులు తీసుకోవడానికి ముందు కొందరు సెలబ్రిటీ కపుల్స్ ఒక కొత్త ట్రెండ్ కి తెర తీశారు. మరికొద్ది రోజుల్లో విడాకులు తీసుకుబోతున్నాం అన్న హింట్ ఇస్తూ తమ సోషల్ మీడియా ఖాతాలలో తమ పార్ట్నర్ కు సంబంధించిన వివరాలను తొలగించడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ గా మారింది. అక్కినేని నాగచైతన్య-సమంత, మెగా డాక్టర్ నిహారిక- చైతన్యల వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే వచ్చింది. తాజాగా, ఈ కోవలోకి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట రాబోతుందని టాక్ వస్తోంది.
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో నుంచి సానియా మీర్జాకు సంబంధించిన ఒక అప్డేట్ ని షోయబ్ మాలిక్ తీసివేయడం చర్చకు దారి తీసింది. గతంలో సానియా మీర్జా భర్త అని ఉండగా…దానికి బదులు ఒక బిడ్డకు తండ్రిని అని పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొంతకాలంగా వీరిద్దరి విడాకులపై వస్తున్న పుకార్లకు తాజా ఘటన ఊతమిచ్చినట్లయింది. కొద్ది నెలలుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. అయితే, తామిద్దరం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని, అందుకే ఇటువంటి పుకార్లు వస్తున్నాయని మాలిక్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
అంతేకాదు తామద్దరం కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా కొద్దిరోజుల క్రితం మాలిక్ ఇన్స్టా లో షేర్ చేశాడు. మరి, ఈ జంట విషయంలో విడాకుల పుకారు పుకారుగానే మిగిలిపోతుందా లేదంటే మిగతా సెలబ్రిటీల మాదిరిగానే ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతుందా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on August 3, 2023 6:16 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…