Trends

గుడ్ న్యూస్….5 సెకన్లలో కరోనా టెస్ట్

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలను దాటేసింది. మరణాల సంఖ్య 718కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలలోని పలువురు శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు.

ఓ వైపు కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తుండగా…మరో వైపు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కనీసం మరో 6 నెలలు పట్టనున్న నేపథ్యంలో కరోనా కేసుల నిర్ధారణ కీలకంగా మారింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ర్యాపిడ్ టెస్టు కిట్లు, ట్రూనాట్ మిషన్ల ద్వారా కరోనా సోకిందో లేదో నిర్ధారిస్తున్నారు.

అయితే, ఈ నిర్ధారణ కోసం సమయం ఎక్కువగా పడుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం మన దేశంతో పాటు పలు దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేవలం 5 సెకన్లలోనే కరోనా వ్యాధి సోకిందో లేదో నిర్ధారించే సాఫ్ట్ వేర్ ను మన దేశానికి చెందిన ప్రొఫెసర్ రూపొందించారు. కరోనా అనుమానిత వ్యక్తి ఎక్స్-రే ఉపయోగించి ఐదు సెకన్లలోను వైరస్ ఉనికిని గుర్తించవచ్చని ఐఐటి-రూర్కీ ప్రొఫెసర్ కమల్ జైన్ చెప్పారు.

తాను రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఒక వ్యక్తి ఎక్స్‌రే ద్వారా రోగికి న్యుమోనియా, ఫ్లూ లక్షణాలున్నాయా లేదా అని వర్గీకరించవచ్చని కమల్ జైన్ తెలిపారు. అంతేకాకుండా, ఆ న్యుమోనియా కరోనాకు సంబంధించిందా లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చని కమల్ జైన్ చెప్పారు. కరోనా, న్యుమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్‌లను తాను విశ్లేషించానని కమల్ జైన్ తెలిపారు.

వాటి ఆధారంగా తాను ఒక ఒక కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ )-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేశానని వెల్లడించారు. దాంతోపాటు అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ చెస్ట్ ఎక్స్-రే డేటాబేస్ ను కూడా తాను విశ్లేషించానని చెప్పారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష ఖర్చు తగ్గుతుందని, అంతేకాకుండా…కరోనా నిర్ధారణ టెస్టుల చేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా సోకే ముప్పు తగ్గుతుందని అన్నారు.

సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని కమల్ జైన్ వెల్లడించారు. ఈ సాఫ్ట్ వేర్ పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఇదే తరహాలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అమెజాన కూడా ఎక్స్ రే ఆధారంగా కరోనా నిర్ధారణపై పరిశోధనలు చేసింది.

This post was last modified on April 24, 2020 5:19 pm

Share

Recent Posts

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

5 minutes ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

40 minutes ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

60 minutes ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

1 hour ago

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

1 hour ago

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

2 hours ago