ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు ఒకట్రెండు ఓకే అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొందరు హీరోయిన్లకు కూడా తొలి సినిమా రిలీజ్ కాకముందే.. ఆ సినిమా ప్రోమోలతో వచ్చిన గుర్తింపు వల్ల అవకాశాలు రావడం కొందరి విషయంలో జరిగింది.
కానీ ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేని కుర్రాడు నటిస్తున్న తొలి చిత్రం విడుదల కాకముందే మూణ్నాలుగు సినిమాల్లో ఛాన్సులు రావడం.. వాటికి సంబంధించి అగ్రిమెంట్లు జరిగిపోవడం అంటే సంచలనంగానే భావించాలి. తమిళంలో భారత్ అనే కుర్రాడు ఇప్పుడు ఇలాగే హాట్ టాపిక్‌గా మారాడు. అతను అప్పుడే ఐదు సినిమాల దాకా కమిటైపోయాడట. ఇదిప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
యూట్యూబ్‌లో ‘ఫైనల్లీ’ అనే ఛానెల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించాడు భారత్. ఈ పాపులారిటీతోనే అతను ‘మిస్టర్ భారత్’ అనే సినిమాలో అవకాశం అందుకున్నాడు. తన పేరుతోనే ఈ సినిమా టైటిల్ పెట్టేయడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తోంది. ఇంతలోనే అతడికి ఇంకో మూణ్నాలుగు సినిమాల్లో అవకాశం దక్కింది. ‘కుటుంబస్థాన్’ మూవీతో తమిళంలో హిట్టు కొట్టిన తెలుగమ్మాయి శాన్వి మేఘనతో ఓ సినిమా.. అలాగే ‘నింజా’ పేరుతో మరో చిత్రం.. ప్రాథన అనే మరో అమ్మాయికి జోడీగా మరో సినిమా ఓకే చేశాడు.
తొలి సినిమా విడుదల కాకముందే అతడికి ఎంత క్రేజ్ వచ్చిందంటే.. ఇటీవల కీర్తి సురేష్ తన కొత్త చిత్రం ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ సందర్భంగా అతడితో ఒక ప్రమోషనల్ వీడియో కూడా చేసింది. కేవలం యూట్యూబ్ ఛానెల్‌తో ఇంత పేరు సంపాదించి.. వరుసగా సినిమా ఛాన్సులు అందుకోవడం, ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే చిన్న స్థాయి స్టార్ అయిపోవడం అరుదైన విషయం.
This post was last modified on December 3, 2025 9:33 pm
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…