మొత్తానికి ఏడాదికి పైగా సాగుతున్న చర్చకు తెరపడింది. మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైపోయాడు. తన భవిష్యత్ మీద జనాలు ఏవేవో ఊహాగానాల్లో ఉండగా.. చడీచప్పుడు లేకుండా స్వాంతంత్ర్య దినోత్సవాన రిటైర్మెంట్ కబురు చెప్పేశాడు.
దీంతో ధోనీని మళ్లీ టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో చూస్తామని ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. అలాగే అతడి రిటైర్మెంట్ కోసం డిమాండ్లు చేస్తున్న వాళ్లు చల్లబడ్డారు. సచిన్ టెండుల్కర్ లాగే 40 ఏళ్ల వయసులో ధోని రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. ఇంతకీ ధోని భవిష్యత్తేంటి.. రాబోయే రోజుల్లో అతనేం చేయబోతున్నాడు అన్నది ఆసక్తికం.
ఈ ఏడాది వరకైతే అతను ఐపీఎల్ ఆడబోతున్నాడు. వచ్చే నెలలో యూఏఈ వేదికగా టోర్నీ ఆరంభం కాబోతోంది. వచ్చే ఏడాది యధావిధిగా వేసవిలో ఐపీఎల్ జరిగేట్లయితే.. అందులోనూ పాల్గొనే అవకాశముంది. కానీ అంతకుమించి అతను ఈ లీగ్‌లోనూ కొనసాగుతాడా అన్నది సందేహమే. 40 ఏళ్లు పైబడ్డాక ఏడాది పొడవునా క్రికెట్టే ఆడకుండా ఉండి.. ఐపీఎల్‌లో సత్తా చాటడం అంటే అంత సులువు కాదు.
కాబట్టి 2022లో ధోనీని ఐపీఎల్‌లో చూస్తామా అన్నది సందేహమే. మరి అప్పుడు ధోని ఏం చేస్తాడో చూడాలి. సచిన్ లాగే ధోని స్టేచర్ వేరు. అతను ద్రవిడ్‌లా కోచింగ్‌కు పరిమితం కాకపోవచ్చు. అలాగని గంగూలీ లాగా బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్‌లోకి రావడమూ సందేహమే. ధోనికి తన స్వరాష్ట్రంలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా రాజకీయాల్లోకి రావచ్చని భావిస్తున్నారు. మొత్తం ఝార్ఖండ్ చరిత్రలోనే ధోని అంత పాపులారిటీ, ఇమేజ్ ఇంకెవరికీ లేదు.
రాజకీయ నాయకులు కూడా అతడి ముందు దిగదుడుపే. అతను సరైన ప్రణాళికలతో వస్తే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి కాగల స్థాయి అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ధోనికి కూడా ఈ ఆసక్తి ఉండే ఉంటుందని.. ఏదైనా ప్రధాన పార్టీలో చేరడమో.. లేక సొంతంగా పార్టీ పెట్టడమో చేసి భవిష్యత్తులో ఝార్ఖండ్ పగ్గాలు చేపట్టడం ఖాయమని అతడి మద్దతుదారులంటున్నారు. చూద్దాం ఏమవుతుందో?
This post was last modified on August 16, 2020 4:42 pm
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…