మహేంద్ర సింగ్ ధోనీ….అకా ఎంఎస్ డీ అలియాస్ మహీ…ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరుంది. మైదానం లోపల మాత్రమే కాదు వెలుపల కూడా ధోనీ టెంపర్ కోల్పోయిన సందర్బాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. మైదానంలో తన మెరుపు వేగంతో స్టంప్స్ ను గిరాటు వేసే ధోనీ…మైదానం బయట మాత్రం మెరుపు వేగంతో దూసుకుపోయే బైక్ లంటే ప్రాణమిస్తాడు. బైక్ లంటే ఇష్టం కాబట్టి..5-6 బైకులు…2-3 కార్లు ఉన్నాయని అనుకుంటే పప్పులో..తప్పులో కాలేసినట్లే.
తాజాగా అదే తరహాలో మహీ బైక్, కార్ల కలెక్షన్ చూసిన మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అవాక్కయ్యాడు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ పేసర్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషీ ధోనీ గ్యారేజ్ ను సందర్శించారు. అక్కడున్న బైకులు, కార్లు చూసి షాకయ్యారు. ఆ గ్యారేజీలోవందల కొద్దీ బైకులు, పదుల సంఖ్యలో కార్లు ఉండడం చూసి నోరెళ్లబెట్టారు. ధోనీ బైక్, కార్లు కలెక్ట్ చేస్తాడని తెలుసని, కానీ, ఇన్ని ఉంటాయని అస్సలు అనుకోలేదని వారు ఆశ్చర్యపోయారు. పాత, కొత్తా అని తేడా లేకుండా మహీ భాయ్ రకరకాల మోడల్ బైక్లు, కార్లను కలెక్ట చేశాడని వెంకీ చెప్పాడు.
ఇక, కొన్ని ఇంపోర్డెట్ కార్లు, బైకులు కూడా ఉన్నాయని వెల్లడించాడు. మరికొన్ని అయితే, ఇండియన్ ఆర్మీ నుంచి కొన్నాడని తెలుస్తోంది. ఏదో బైకులు కొన్నాం..పక్కన పడేశాం అన్న రీతిలో కాకుండా…వాటికి తరచుగా సర్వీసింగ్ కూడా స్వయంగా ధోనీనే చేస్తాడట. దాదాపుగా ఓ పెద్ద బైకు, కారు షోరూం మాదిరలో ఉన్న ధోనీ గ్యారేజీ వీడియోను వెంకటేష్ ప్రసాద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో, ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మహీ కలల బైక్ ల కలెక్షన్ చూసి ఖంగుతింటున్నారు.
This post was last modified on July 19, 2023 9:01 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…