చైనా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా జూన్ 29న సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లను ఒకేసారి నిషేధించి వాటి యాజమాన్యాలకు, యూజర్లకు ఒకేసారి పెద్ద షాకే ఇచ్చింది కేంద్రం. రెండు వైపులా ఆవేదన స్వరాలు వినిపించినా మోడీ సర్కారు పట్టించుకోలేదు. తమ నిర్ణయానికి కట్టుబడే ఉంది. మిగతా యాప్‌ల మాటేమో కానీ.. టిక్ టాక్ నిషేధంతో మాత్రం కోట్లాది మంది గగ్గోలు పెట్టారు. కొన్నేళ్లుగా తమ జీవనంలో భాగంగా మారిపోయిన టిక్ టాక్‌ను ఒకేసారి ఇలా విడిచిపెట్టడం చాలా కష్టమైంది. కొందరు సైలెంటయ్యారు. కొందరు ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. మళ్లీ టిక్ టాక్ రాకపోదా అన్న ఆశతో కొందరున్నారు.
ఐతే ప్రపంచవ్యాప్తంగా చైనా అవతల టిక్ టాక్ యూజర్లు 20 కోట్లకు పైగానే ఉండగా.. అందులో సగానికి పైగా భారతీయులే కావడం గమనార్హం. భారత్‌లో టిక్ టాక్ మీద 20 వేల కోట్ల దాకా బిజినెస్ జరుగుతోందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత బిజినెస్‌ను అంత సులువుగా ఎలా వదిలేసుకుంటారు. టిక్ టాక్ యాజమాని అయిన చైనా సంస్థ బైట్ డ్యాన్స్.. ఎలాగైనా ఆ యాప్‌ను తిరిగి తీసుకురావాలని కష్టపడుతోంది. ఓ అమెరికా సంస్థకు వాటాలిద్దామని ప్రయత్నించింది కానీ కుదర్లేదు. ఇప్పుడు బైట్ డ్యాన్స్.. భారతీయ సంస్థ జియోతో డీల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జియోకు మెజారిటీ వాటా ఇచ్చి ‘టిక్ టాక్’ను భారతీయ సంస్థగా మార్చి.. తద్వారా తిరిగి ఆ యాప్‌ను జన బాహుళ్యంలోకి తీసుకురావాలన్నది బైట్ డ్యాన్స్ ప్రయత్నం. ఇదెంత వరకు ఫలిస్తుందో చూడాలి మరి.
This post was last modified on August 13, 2020 8:28 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…