రూ.500 నోట్ కూడా ఔట్?

రిజర్వ్ బ్యాంక్ తొందరలోనే మరో కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లుంది. ఈమధ్యనే రు. 2 వేల నోట్లను రద్దుచేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొందరలోనే రు. 500 నోట్లను కూడా రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే మార్కెట్లో రు. 2 వేల నకిలీ నోట్లకు మించి రు. 500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆందోళన వ్యక్తంచేసింది. దాంతో రు. 500 నోట్లను కూడా రద్దుచేయటం ఒకటే మార్గమని డిసైడ్ అయ్యిందట.

ఎప్పుడైతే రు. 2 వేల నోట్ల ఉపసంహరించిందో అప్పటినుండే రు. 500 నకిలీ నోట్లు చెలామణలోకి వచ్చేసిందని బ్యాంకు గుర్తించింది. రు. 2 వేల నోట్ల రద్దులో రిజర్వబ్యాంకు ఒకటి అనుకుంటే గ్రౌండ్ లెవల్లో మరోటి జరుగుతోంది. నోట్లను రద్దుచేయగానే మార్కెట్లో ఉన్న రు. 3.16 లక్షల కోట్ల డబ్బంతా బ్యాంకులకు వచ్చేస్తుందని అనుకున్నది. అయితే రద్దయిన రు. 2 వేల నోట్లలో బ్యాంకులకు చేరింది 20 శాతం మాత్రమేనట. మరి మిగిలిన నోట్లన్నీ ఏమయ్యాయి ? ఏమయ్యాయయంటే నగల దుకాణాలు, రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, పెట్రోల్ బంకులకు చేరుతున్నాయి.

రు. 2 వేల నోట్లు రద్దుకాగానే ఒక్కసారిగి రు. 500 నోట్ల చెలామణి పెరిగిపోయిందట. దీన్ని రిజర్వ్ బ్యాంకు జాగ్రత్తగా గమనిస్తే అంతకుముందు మార్కెట్ చెలామణితో పోల్చితే పెద్దనోట్ల రద్దుతర్వాతే రు. 500 నోట్ల చెలామణి పెరిగిపోయిందని అర్ధమైందట.  కారణం ఏమిటంటే రు. 500 నోట్లలో నకిలీ నోట్లు 5 రెట్లు మార్కోట్లోకి వచ్చేశాయట. ఇపుడు చెలామణిలో ఉన్న రు. 500 నోట్లలో 20 శాతం నకిలీ నోట్లేనని రిజర్వ్ బ్యాంకు గుర్తించిందట.

దేశాన్ని అస్ధిరపరిచేందుకే పాకిస్ధాన్ చేస్తున్న కుట్రగా మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మన కరెన్సీని పాకిస్ధాన్ పెద్దఎత్తున ముద్రించి నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా మనదేశంలోకి చేరవేస్తున్నట్లు నిఘావర్గాలు గమనించాయి. దీన్ని అడ్డుకునేందుకే రు. 500 నోట్లను  కూడా రద్దుచేయాలని రిజర్వ్ బ్యాంకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి రద్దు ముహూర్తం ఎప్పుడో చూడాలి.