స్మార్ట్ ఫోన్ వాడుతూ.. సోషల్ మీడియాను ఉపయోగించే ఏ వ్యక్తి.. ఫేస్ బుక్ యాప్‌ను వాడకుండా ఉండలేడు. దాన్నో దినసరి వ్యవహారంలా.. వ్యసనంలా మార్చేసిన వ్యక్తి మార్క్ జుకర్‌బర్గ్. టీనేజీలోనే ఈ సంస్థను నెలకొల్పి.. పాతికేళ్ల వయసొచ్చేసరికే వేల కోట్ల ఆదాయానికి పడగలెత్తిన వ్యక్తి అతను.
ఫేస్ బుక్‌తో సరిపెట్టకుండా వాట్సాప్ సహా మరికొన్ని సంస్థల్ని సొంతం చేసుకుని మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆదాయం పెంచుకున్నాడు. రోజు రోజుకూ అతడి సంస్థలు పెద్దవవుతున్నాయి. జుకర్‌బర్గ్‌ను మరింత సంపాదన పరుడిగా మారుస్తున్నాయి. తాజాగా అతను అరుదైన క్లబ్‌లోకి చేరాడు.
ప్రపంచంలో ఇప్పటిదాకా ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేరుకున్న క్లబ్ అది. 100 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించిన మూడో వ్యక్తిగా జుకర్‌బర్గ్ రికార్డులకెక్కాడు. ఇప్పటిదాకా అమేజాన్ అధినేత జెఫ్ బిజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రమే ఈ క్లబ్బులోకి చేరారు.
గత వార్షిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్ల ఆదాయం పొందడం ద్వారా జుకర్‌బర్గ్ కూడా 100 బిలియన్ డాలర్ల సంపాదన పరుడిగా మారాడు. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే అతడి సంపద 75 వేల కోట్ల పైమాటే అన్నమాట. మరోవైపు మన ముకేష్ అంబాని 81 బిలియన్ డాలర్లతో ఈ క్లబ్బు దిశగా అడుగులు వేస్తున్నాడు.
This post was last modified on August 9, 2020 10:36 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…