బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, బజ్‌రంగ్ పునియా తదితర అగ్రశ్రేణి రెజ్లర్లు కొన్ని నెలల నుంచి తీవ్ర స్థాయిలో పోరాడుతున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ సమాఖ్యను ఎన్నో ఏళ్లుగా తన గుప్పెట్లో పెట్టుకుని ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న బ్రిజ్ భూషణ్ మీద రకరకాల ఆరోపణలున్నాయి. పలువురు రెజ్లర్లు అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
అతణ్ని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి కదలిక లేదు. ఒక మైనర్‌తో పాలు పలువురు మహిళా రెజ్లర్లు అతడిపై ఫిర్యాదు చేసినా.. ఎఫ్ఐఆర్ వేయడానికి చాలా టైం పట్టింది. రెజ్లర్లు రోడ్డు మీదికి వచ్చి రెండు దఫాలుగా నిరసన దీక్ష చేపట్టాక కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎంతో ఒత్తిడి తర్వాత ఇది ఒక్కటి జరిగింది కానీ.. అంతకుమించి ఏ కదలికా లేదు.
ఇదిలా ఉండగా.. ఆదివారమే ప్రారంభోత్సవం జరుపుకున్న కొత్త పార్లమెంటు భవనం ముందు మహా పంచాయత్ కార్యక్రమం చేయడానికి రెజ్లర్లు వెళ్లగా.. పోలీసులు వారిని అక్కడి నుంచి లాగి పడేశారు. ఈ సందర్భంగా రెజ్లర్ల పట్ల పోలీసులు చూపించిన కర్కశత్వానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే ఈ విషయంలో రెజ్లర్లకు సానుభూతి వచ్చేస్తోందని.. మోడీ సర్కారు బద్నాం అవుతోందని బీజీపీ ఐటీ సెల్ రంగంలోకి దిగేసింది.
ఆందోళన అనంతరం వ్యాన్లో ప్రయాణిస్తూ వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ తదితరులు సెల్ఫీ తీసుకోగా.. అందులో వాళ్లు నవ్వుతూ చాలా సంతోషంగా ఉన్నారంటూ ఒక ఫొటోను వైరల్ చేశారు. కానీ వాస్తవానికి వాళ్లు తీసుకున్న సెల్ఫీలో సీరియస్‌గానే ఉన్నారు. ఐతే మనుషుల హావభావాలను మార్చే యాప్స్‌ను వాడి వాళ్లు నవ్వుతున్నట్లుగా ఈ ఫొటోను మార్చేశారు. ఇలా ఫొటోల్లో హావభావాలను ఎలా మార్చారో వీడియో రూపంలో నెటిజన్లు చూపిస్తున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ప్రముఖ రెజ్లర్లు పోరాడుతుంటే.. ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో పైశాచికత్వం చూపించడాన్ని అందరూ తప్పుబడుతున్నారు.
This post was last modified on May 29, 2023 11:46 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…