పెద్ద నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఉద్దేశ్యంతో రద్దు చేసిందో తెలీదు. నాలుగు రోజుల క్రితం 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రకటించిన మరుసటి రోజునుండి జనాలు నగల షాపులకు క్యూ కడుతున్నారు. ఆర్బీఐ ఉద్దేశ్యం ఏమిటంటే రద్దయిన నోట్లను జనాలు బ్యాంకులకు తీసుకొచ్చి డిపాజిట్ చేసుకుంటారు లేదా మార్చుకుంటారని. పెద్దనోట్లు రద్దయిన తర్వాత భూములు, వస్తువులు కొనుగోలుకు పెద్దగా ఉపయోగించరు. ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు రద్దయిన నోట్లను తీసుకోవటానికి అంగీకరించరు.
అయితే ఆర్బీఐ ఆలోచనకు విరుద్ధంగా బంగారం షాపుల దగ్గర జనాల క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. ఇంత మంది జనాలు బంగారం షాపుల్లోకి వెళుతున్నారంటే అర్ధమేంటి ? 2 వేల రూపాయల నోట్లతో బంగారం, వజ్రాలు, వెండి ఇలా ఏదో ఒక విలువైన వస్తువులను కొనేస్తున్నారనే కదా. ముంబాయ్, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, సూరత్ తదితర నగరాల్లోని బంగారం వ్యాపారస్తుల దగ్గర గడచిన మూడురోజులుగా వ్యాపారం విపరీతంగా పెరిగిపోయిందని సమాచారం.
కొంతమంది వ్యాపారాస్తులైతే బంగారం కొనుగోలు సమయంలో 2 రెండువేల రూపాయల నోట్లు తీసుకోవాలంటే 5 శాతం అదనంగా ఛార్జ్ చేస్తున్నారట. అదనపు చార్జ్ చేస్తున్నా జనాలు ఆ మొత్తాన్ని చెల్లించేసి నగలు కొనేస్తున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే చాలామంది రు. 2 వేల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు బ్యాంకులకు వెళ్ళటం లేదు. తమ దగ్గర ఉన్న డబ్బుతో నేరుగా నగల షాపులకు వెళిపోతున్నారు.
తాము దాచుకున్న లేదా దగ్గరున్న 2 వేల రూపాయల నోట్లతో పెద్ద ఎత్తున నగలు కొనేస్తున్నారట. కొంతమంది పెద్ద ఫర్నీచర్ షాపుల యాజమాన్యాలు కూడా 2 వేల నోట్లను తీసుకుంటామని ప్రకటించటంతో ఇంకొంతమంది విలువైన ఫర్నీచర్ ను కొనేస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ లెక్కల ప్రకారం జనాల నుండి రు. 3.6 లక్షల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు సెప్టెంబర్ 30వ తేదీకల్లా బ్యాంకులకు వచ్చేయాలి. కానీ పరిస్ధితి చూస్తుంటే అలా వచ్చేట్లు కనబడటంలేదు. అంటే గడువు తర్వత కూడా బ్యాంకులకు రాని డబ్బును బ్లాక్ మనీగా పరిగణిస్తారు. అందుకనే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు నగల షాపుల మీద కన్నేసుంచారట. మరి చివరకు ఎంత డబ్బు బ్యాంకులకు వస్తుందో చూడాల్సిందే.
This post was last modified on May 22, 2023 11:40 am
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్‌పై టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…