బ్రిటన్ ప్రధాని, భారత మూలాలు ఉన్న రుషి సునాక్.. ఆయన సతీమణి అక్షతల సంపద ఆవిరి అయి పోయింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా.. 200 మిలియన్ పౌండ్ల సంపద హరించుకుపోయినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధానిగా సునాక్ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అంతకు ముందు ప్రభుత్వం పన్నులుతగ్గించడంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు సునాక్ చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ఇవి కట్టడి కావడం లేదనే సమాచారం తరచుగా వినిపిస్తోంది.
ఇంతలో ద్రవ్యోల్బణం కారణంగా.. బ్రిటన్ ప్రధాని దంపతుల సంపదే ఆవిరి కావడం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత 12 నెలల్లోనే వీరి సంపదలో సుమారు 200 మిలియన్ పౌండ్లు ఆవిరయ్యిందని బ్రిటన్ మీడియా అంచనా వేసింది. అంటే రోజూ సుమారు 5లక్షల పౌండ్లు కోల్పోతున్న ట్లు లెక్కలు చెబుతున్నారు. తాజాగా సండే టైమ్స్ విడుదల చేసిన బ్రిటన్ సంపన్నుల జాబితాలో రిషి సునాక్ దంపతులు 275వ స్థానంలో కొనసాగుతున్నారు.
అంతకు ముందు 222వ స్థానంలో ఉండగా.. ఏడాది కాలంలోనే ఈ క్షీణత కనిపించింది. అయితే, ఇన్ఫోసిస్ షేర్లు పతనమవ్వడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అంచనా. దీనిలోనూ సునాక్ సతీమణి అక్షతకి 64 బిలియన్ డాలర్ల (52 బిలియన్ పౌండ్లు) విలువైన వాటా ఉంది. సంస్థ మొత్తం షేర్లలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అయితే, గత ఏడాది నుంచి ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో సునాక్ దంపతుల సంపద కూడా తరిగిపోయినట్లు సమాచారం.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు జీతభత్యాల కింద ఏడాదికి 1.65 లక్షల పౌండ్లు సమకూరుతుంది. గతేడాది యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిద్దరి సంపద విలువ 730 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. అయితే, ఇటీవల మార్కెట్లు పతనం అవుతుండటంతో వారి సంపద విలువ 529 మిలియన్ పౌండ్లకు (66.8కోట్ల డాలర్లు) పడిపోయింది. దీనిపై బ్రిటన్ పత్రికలు రోజుకో కథనం రాస్తుండడం గమనార్హం.
This post was last modified on May 21, 2023 12:43 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…