ఇల్లాళ్లందు.. మహా ఇల్లాలు వేరయా! అన్నట్టుగా వ్యవహరించింది… ఈ భార్యామణి. కట్టుకున్న భర్తను ప్రి యుడితో దారుణంగా హత్య చేయించడమే కాకుండా.. ఎలా హత్య చేయాలో కూడా సూచించింది. అంతటి తో కూడా ఆమె ఆగలేదు. ప్రియుడు హత్య చేస్తుంటే.. సంతోషంగా వీడియో కూడా తీసింది. ఇలా కాదు.. ఇలా.. అంటూ.. తనదైన శైలిలో ఎలా హత్య చేయాలో సూచించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని జగద్గిరి గుట్టలో చోటు చేసుకుంది.
ఆ మహా ఇల్లాలు ఎవరో కాదు.. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జిమ్ కోచ్ దారుణ హత్య ఉదంతంలోఆయన గారి సతీమణి! ఇక, ఈ హత్యపై ఇప్పటి వరకు ఆత్మహత్య అని, అగ్ని ప్రమాదమని అందరూ అనుకున్నారు. అంతేకాదు.. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఖాకీల రంగ ప్రవేశంతో సీన్ మొత్తం మారిపోయింది. ఇది ప్రమాదం కాదని.. పక్కా స్కెచ్‌తో చేసిన మర్డర్ అని పోలీసులు తేల్చేశారు.
ఏం జరిగిందంటే..
జగద్గిరి గుట్టలో జిమ్ నిర్వమించే కోచ్ జయకృష్ణ ఇటీవల మరణించారు. దీని పై అనేక అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలో విచారణ చేసిన పోలీసులు అతని భార్య దుర్గ దగ్గరుండి హత్య చేయించిందని గుర్తించారు. తన ప్రేమికుడు చిన్నాతో హత్య చేయించడమే కాకుండా.. ఆ మొత్తం వ్యవహారాన్నీ వీడియో కాల్ ద్వారా పర్యవేక్షించిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణం జరగడానికి 3 రోజుల ముందే తన సొంతూరు భీమవరం వెళ్లిపోయిన దుర్గ, అక్కడ్నుంచే తన బాయ్ ఫ్రెండ్ చిన్నా సహాయంతో ఈ హత్యను చేయించిందని పోలీసులు వెల్లడించారు.
హత్యకు ముందు.. జయకృష్ణకు ఫుల్లుగా మద్యం పట్టించి, అతడు మత్తులోకి జారుకున్న తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు చిన్నా. నిప్పు వెలిగించిన వెంటనే అపార్ట్ మెంట్ వెనక నుంచి పరారయ్యాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో కాల్ లో చూసింది దుర్గ… దీంతో పోలీసులు ఆమె కోసం వేట ప్రారంభించారు. మొత్తానికి మహా ఇల్లాలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on May 22, 2023 6:50 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…