రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన రాధ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ ట్విస్టు ఒకటి బయటకు వచ్చింది. చిన్ననాటి స్నేహితుడికి రూ.80 లక్షలు అప్పు ఇవ్వటం.. ఆ తర్వాత అతను ఇవ్వకపోవటం.. దీనిపై జరిగిన రభస.. అనంతరం ఆమెకు డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికి.. ఊరికి రప్పించి మరీ దారుణంగా.. కిరాతకంగా హత్య చేసిన ఉదంతానికి సంబంధించి షాకింగ్ నిజాన్ని పోలీసులు బయటకు వెలికి తీశారు. భర్తే హంతకుడిగా గుర్తించారు.
కారుతో తొక్కించి.. బండరాళ్లతో మోదీ.. సిగరెట్లతో కాల్చి.. నోటితో చెప్పలేనంత దారుణంగా హింసకు గురి చేసి చంపేసిన వైనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తొలుత ఈ దారుణానికి పాల్పడింది అప్పు తీసుకొని ఎగ్గొట్టిన చిన్ననాటి స్నేహితుడిగా భావించి.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. ఈ ఉదంతంలో కోట రాధ భర్త వైఖరి సందేహాలకు తావిచ్చేలా ఉండటం.. అతడి తీరుపై వస్తున్న సందేహాల్ని తీర్చుకోవటానికి పోలీసులు ప్రశ్నలు వేయటంతో.. చివరకు తాను చేసిన పనిని ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు.
చిన్ననాటి స్నేహితుడైన కాశిరెడ్డి ప్రాజెక్టు కోసం రూ.80 లక్షలు అడగటం.. సర్లేనని అంత భారీ మొత్తాన్ని అప్పుగా ఇవ్వటం తెలిసిందే. రూ.80 లక్షలు తీసుకున్న తర్వాత నుంచి అతడు పత్తా లేకుండా.. సమాధానం చెప్పకుండా ఉన్న కేతిరెడ్డి తీరుతో ఆగ్రహానికి గురైన రాధ.. అతడి నుంచి డబ్బులు వసూలు చేసుకోవటానికి ప్రయత్నించింది. ఇదిలా ఉంటే.. ఊరికి వస్తే డబ్బులు ఇస్తానని చెప్పటంతో ఆమె వెళ్లింది. అయితే.. కేతిరెడ్డి వద్దకు వెళ్లిన ఆమె.. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు కనిపించినా.. ఆమెను చూసినోళ్లంతా దారుణంగా హింసకుగురి చేసిన చంపిన వైనాన్ని గుర్తించారు. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు ఆమె భర్తే ఆమెను ఇంతలా చంపిందన్న విషయాన్ని తేల్చారు.
భార్యను నమ్మించేందుకు కాశిరెడ్డి పేరుతో సిమ్ కార్డు కొన్న అతను.. అతని పేరుతోనే భార్యకు సెల్ ఫోన్ లో కాశిరెడ్డి పేరుతో చాట్ చేయటం చేశాడు. డబ్బులు ఇస్తానని నమ్మబలికాడు. ఇవేమీ తెలియని ఆమె వెళ్లి దారుణ హింసకు గురై చనిపోయింది. రాధకు.. ఆమె బాల్య స్నేహితుడికి మధ్య ఏదో ఉందన్న సందేహంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. రాధను కారులో తీసుకెళ్లి తీవ్రంగా హింసించి చంపారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన రాధ భర్తతో పాటు.. అతడికి సహకారాన్ని అందించిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
చిన్ననాటి స్నేహితుడికి డబ్బుల్ని అప్పుగా ఇచ్చిన తర్వాత నుంచి భర్త పెట్టే వేధింపులకు తాళ లేక.. ఆమె పుట్టింటి వారి నుంచి కొంత డబ్బులు తీసుకొని ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫ్రెండ్ ను చిన్ననాటి స్నేహితుడు ఇంత కిరాతకంగా హత్య చేయటమా? అన్న ప్రచారం జరిగి వేళలో.. అందుకు భిన్నంగా భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా గుర్తించారు. అతడికి సహకరించిన వారి కోసం వెతుకుతున్నారు.